/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

Micro containment zones in Hyderabad: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,464 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనాతో మరో 25 మంది చనిపోయారు. అలాగే 4,801 మంది కరోనా  నుంచి కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. 

కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు గత రెండు, మూడు రోజులుగా పోలీసులు సైతం కఠినంగానే వ్యవహరిస్తున్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి (DGP Mahender Reddy) ఆదేశాల మేరకు రోడ్లపై లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు.. అనవసరంగా రోడ్లపైకొచ్చే వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు. 

Also read : CM KCR visits MGM Hospital: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి సీఎం కేసీఆర్

నిత్యం నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులలో హైదరాబాద్‌ పరిధిలోనే (GHMC) అధికంగా ఉంటుండటంతో నగరంలో అధిక కేసులు ఉన్న 11 ప్రాంతాలను గుర్తించి వాటిని మైక్రో కంటెన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అలాగే వరంగల్‌ రూరల్ జిల్లాలోనూ కరోనా కేసులు ఎక్కువగా ఉన్న 16 ప్రాంతాల్లో, అర్బన్ జిల్లాలో 12 ప్రాంతాలను మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో రాకపోకలు నిలువరిస్తూ లాక్‌డౌన్ (Lockdown in Telangana) మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.

Also read : TS SSC Results 2021: తెలంగాణలో టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Telangana latest COVID-19 healh bulletin: Lockdown to micro containment zones in Hyderabad
News Source: 
Home Title: 

Telangana: తెలంగాణ కరోనా బులెటిన్.. కొత్తగా మైక్రో కంటెన్మైంట్ జోన్స్ ఏర్పాటు

Telangana: తెలంగాణ కరోనా బులెటిన్.. కొత్తగా మైక్రో కంటెన్మైంట్ జోన్స్ ఏర్పాటు
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Telangana: తెలంగాణ కరోనా బులెటిన్.. కొత్తగా మైక్రో కంటెన్మైంట్ జోన్స్ ఏర్పాటు
ZH Telugu Desk
Publish Later: 
Yes
Publish At: 
Friday, May 21, 2021 - 22:50
Request Count: 
62
Is Breaking News: 
No