Omicron Scare: తెలంగాణలో మళ్లీ కఠిన ఆంక్షలు- న్యూ ఇయర్ వేడుకలు బంద్!

దేశవ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అంతకంతకూ (Omicron fears in India) పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో తెలంగాణ కుడా చేరింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2021, 07:03 PM IST
  • తెలంగాణలో మరోసారి కొవిడ్ ఆంక్షలు
  • నేటి నుంచే అమలులోకి కరోనా రూల్స్​
  • బహిరంగ సభలకు అనుమతి రద్దు
Omicron Scare: తెలంగాణలో మళ్లీ కఠిన ఆంక్షలు- న్యూ ఇయర్ వేడుకలు బంద్!

Omicron Scare: దేశవ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అంతకంతకూ (Omicron fears in India) పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో తెలంగాణ కుడా చేరింది.

రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ. ఒమిక్రాన్ తీవ్రత పెరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు (New Covid rules in Telangana) తెలుస్తోంది. దీనికి తోడు తెలంగాణ హై కోర్టు కూడా పండుగల వేళ ఆంక్షలు విధించాలని ఇటీవల సూచించిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఆంక్షల అమలు నేటి నుంచే..

కొవిడ్ ఆంక్షలపై ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కొవిడ్ ఆంక్షలు నేటి నుంచే (శనివారం) అమలులోకి వస్తాయని స్పష్టం (Covid restrictions) చేశారు.

దీనితో ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వల్లో పేర్కొంది ప్రభుత్వం​. ఆంక్షలతో కూడిన పబ్లిక్ ఈవెంట్స్​లో భౌతక దూరం, మాస్క్ ధరించడం వంటివి ఖచ్చితంగా పాటించాలని తెలిపింది. మాస్క్​ పెట్టుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెల్చి చెప్పింది. ఇప్పటికే మాస్క్ పెట్టుకోని వారికి రూ.1,000 జరిమానా విధిస్తున్నట్లు గుర్తు చేసింది.

న్యూ ఇయర్ వేడుకల్లో కరోనా వ్యాప్తికి అవకాశాలు ఎక్కవగా ఉన్నందున..  డిసెంబర్ 31 నుంచి జనవరి 2 దాక మరింత కఠినంగా ఆంక్షలు అమలవుతాయని పేర్కొంది ప్రభుత్వం. ఇలాంటి సమయంలో ప్రజలంతా ఒమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అనవసర ప్రయాణాలు, పార్టీల వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించింది.

అన్ని జిల్లాల్లో నూతన నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్థానిక యంత్రాగాలను ఆదేశించింది ప్రభుత్వం.

Also read: Revanth Reddy: టీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి వార్నింగ్..అలా చేస్తే గాజులు, చీరలు పంపిస్తాం

Also read: Attack on Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నపై కత్తితో దాడి.. ఇది టీఆర్ఎస్ గూండాల పనే అంటున్న మల్లన్న

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News