Punjagutta: హైదరాబాద్ సీపీ కీలక నిర్ణయం.. పంజాగుట్ట పీఎస్ సిబ్బంది మొత్తం బదిలీ.. కారణం ఏంటంటే..?

Hyderabad: కొంతకాలంగా పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో అంతర్గతంగా ఉండాల్సిన అనేకే కేసుల విషయాలు బయటకు తెలిసిపోతున్నట్లు సమాచారం. దీంతో ఏకంగా సీపీ శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

Last Updated : Jan 31, 2024, 03:47 PM IST
  • - దిమ్మతిరిగే ఆదేశాలు జారీచేసిన హైదరాబాద్ సీపీ
    - పంజాగుట్ట పీఎస్ స్టాఫ్ మొత్తం బదిలీ..
    - బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు వ్యవహరం పై సీరియస్..
 Punjagutta: హైదరాబాద్ సీపీ కీలక నిర్ణయం.. పంజాగుట్ట పీఎస్ సిబ్బంది మొత్తం బదిలీ.. కారణం ఏంటంటే..?

CP Kottakota Srinivas Reddy: తెలంగాణా లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలనపై ప్రత్యేక మార్క్ ను కనబరుస్తుంది. దీనిలో భాగంగా గత ప్రభుత్వం కాలంలో సంవత్సరాల తరబడి ఉన్న అధికారులను ట్రాన్స్ ఫర్ చేసింది. అదే విధంగా.. కొందరు అధికారులు గత  ప్రభుత్వానికి ఫెవర్ గా ఉంటూ క్విడ్ ప్రో కో మాదిరిగా ఉండటం ను అధికారులు గుర్తించారు. దీంతో పోలీసులు అన్నిశాఖలను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

పంజాగుట్ట పీఎస్ లో హోంగార్డు నుంచి ఇన్ స్పెక్టర్ వరకు అందరిని బదిలీ చేస్తు ఆదేశాలు జారీచేశారు. వీరందరిని ప్రస్తుతం.. సిటీ ఆర్మ్ డ్ రిజర్వకు మెయిన్ ఆఫీస్ లో రిపోర్టు చేయాలని కూడా ఆదేశించారు. గత కొంతకాలంలో.. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడి వ్యవహరమని సమాచారం.

అదే విధంగా స్టేషన్ లోని అనేక నిర్ణయాలు మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందుతుందని అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే దాదాపు.. 85 మందిని బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పంజాగుట్ట పీఎస్ కు కొత్తగా 82 మంది సిబ్బందిని కేటాయించినట్లు సమాచారం. 

Read Also: High Court: ''దేవాలయాలు పిక్నిక్ స్పాట్ లు కావు..".. హిందూయేతరుల ప్రవేశాలపై కీలక వ్యాఖ్యలు చేసిన మద్రాసు హైకోర్టు...

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News