TS SSC Exams Paper Leak Case: సంచలనం సృష్టించిన తెలంగాణ పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం లీక్ ఘటనలో పేపర్‌ని బయటికి ఇచ్చినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హరీష్ అనే విద్యార్థిని ఎస్ఎస్సీ బోర్డు 5 ఏళ్ల పాటు పరీక్షలకు హాజరు కాకుండా డిబార్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనపై తెలంగాణ ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీజేపి, బీఆర్ఎస్ పార్టీ కలిసి ఆడిన కుట్రకు హరీష్ అనే విద్యార్థి బలయ్యాడని.. హరీష్ భవిష్యుత్తును దృష్టిలో పెట్టుకుని అతడు మిగతా పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించాలని కోర్టును విజ్ఞప్తి చేశారు.
నేడు శనివారం ఈ రిట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా బల్మురి వెంకట్ తరపు న్యాయవాది తమ వాదనలను కోర్టుకు వినిపించారు. ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేకుండానే రాజకీయ నాయకులు ఆడిన ఆటలో హరీష్ అనే విధ్యార్థి బలయ్యాడని.. ఇందులో ఆ విద్యార్ధికి ఎలాంటి ప్రమేయం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఆ విద్యార్థి భవిష్యత్ దృష్ట్యా అతడు మిగతా పరీక్షలకు హాజరయ్యేలా ఆదేశాలు జారీచేయాలని న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం.. ఇకపై జరగబోయే పదో తరగతి పరీక్షలు రాసేందుకు హరీష్‌ను అనుమతించాలని ఎస్ఎస్సీ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అలాగే హరీష్ అవకాశం కోల్పోయిన హిందీ, ఇంగ్లీష్ పరీక్షలకు కూడా సప్లిమెంటరీకి అనుమతి ఇవ్వాల్సిందేనని హై కోర్టు తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
స్వయంగా తమ ఇంటికి వచ్చి మరీ విద్యార్థి హరీష్ తరపున న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇచ్చిన ఎన్ఎస్‌యూఐ చీఫ్ బల్మూరి వెంకట్.. చెప్పినట్టుగానే న్యాయ సహాయం చేసి తమకు ఎంతో సహాయం చేశారని హరీష్ కుటుంబసభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి : Bandi Sanjay Comments: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ సన్మానం.. శాలువా తీసుకువస్తే చివరికి..
ఇదిలావుంటే, ఈ కేసులో ఏ1 నిందితుడిగా అరెస్ట్ అయిన తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ కేసులో బండి సంజయ్‌ని పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వరంగల్ పోలీసులు దాఖలు చేసిన కస్టడి పిటిషన్‌పై హన్మకొండ కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. ఈ విచారణలో కోర్టు పోలీసులకు అనుకూలంగా ఆదేశాలు జారీచేస్తే.. బండి సంజయ్ కుమార్‌ని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి : PM Modi Speech: సీఎం కేసీఆర్ టార్గెట్‌గా ప్రధాని మోదీ ప్రసంగం.. అవినీతిపరులపై చర్యలు ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK