Group 2 Exam: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధం అయింది. గ్రూప్-2 పరీక్షల్లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఈ రోజు పేపర్-1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల 30నిమిషాల వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30నిమిషాల వరకు పేపర్-2 ఉంటుంది. ఇక రేపు పేపర్3, 4 పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-2 ప్రతి పేపరులో 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహిస్తున్నారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లు మూసివేస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ మేరకు అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా వెల్లడించింది. అభ్యర్థులందరూ బయోమెట్రిక్ తప్పనిసరి వేయాలని స్పష్టం చేసింది. లేదంటే ఓఎంఆర్ పత్రాలు దిద్దబోమని తెలిపింది.
అంతేకాదు పరీక్ష రాసే అభ్యర్ధులు హాల్ టికెట్ వెంట తీసుకురావాలి. హాల్ టికెట్ ఉన్నవారినే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలన్నారు. హాల్ టికెట్ పై క్లియర్ గా కనిపించేలా ఫొటో ఉండాలని..లేకపోతే గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి తీసుకురావాలన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి తీసుకెళ్లరాదు. మాల్ ప్రాక్టీసింగ్, చీటింగ్ వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. టీజీపీఎస్సీ పరీక్షలు రాయకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మొత్తం 783 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) గతేడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. లాస్ట్ ఇయర్ ఆగస్టు 29, 30న గ్రూప్-2 పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. వరుసగా గ్రూప్-1, 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున.. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దీంతో వాయిదా పడుతూ వచ్చాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 5.51 లక్షల మందికి పైగా అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షలు రాయనున్నారని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రశ్నా పత్రాలకు సంబంధించి 58 స్టోరేజ్ పాయింట్లు పెట్టామన్నారు. 2015లో గ్రూప్ 2 నోటిఫికేషన్ అమలుకు చాలా సమయం పట్టిందని, కానీ ఈసారి చాలా వేగంగా ఫలితాలు ఇస్తామని స్పష్టం చేశారు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం.
ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..
ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.