Piyush Goyal on Paddy Procurement: వరి ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం (Telangana govt) పూర్తిగా విఫలమైందని కేంద్రమంత్రి పీయుష్ గోయల్ విమర్శించారు. కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఖరీఫ్ సీజన్లో ఇవ్వాల్సిన ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. నాలుగుసార్లు గడువు పొడగించినా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణను (Paddy purchase) పూర్తి చేయలేదన్నారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి పీయుష్ గోయల్ మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ (Telangana) నుంచి అదనంగా 20లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ (Boiled rice) కొనుగోలుకు ఒప్పందం జరిగిందని పీయుష్ గోయల్ పేర్కొన్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఈ అవకాశం కల్పించామన్నారు. రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటామని గతంలోనే తెలంగాణ ప్రభుత్వానికి చెప్పామన్నారు. ఇకనైనా కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం అసత్య ప్రచారం మానుకోవాలన్నారు. ఇక తెలంగాణ మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదనే వాదనను పీయుష్ గోయల్ తోసిపుచ్చారు. తాను బిజీ షెడ్యూల్లో ఉన్న సమయంలో అపాయింట్మెంట్ కోరడమేంటని ప్రశ్నించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ... ఎఫ్‌సీఐకి ధాన్యం సరఫరా చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. ముడి బియ్యం, బాయిల్డ్ రైస్ కలిపి 27.39లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం (TRS govt) ఎఫ్‌సీఐకి సప్లై చేయాల్సి ఉందన్నారు. భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని గతంలో రాష్ట్ర ప్రభుత్వమే లేఖ ఇచ్చిందని అన్నారు. ఇప్పుడేమో కేంద్రం తమ మెడపై కత్తి పెట్టి ఆ లేఖ తీసుకుందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజా కొంటామని కేసీఆర్ (CM KCR) గతంలో చెప్పారని... రాష్ట్ర బడ్జెట్ నుంచి అందుకు తగిన కేటాయింపులు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: Greater Noida: ఏడో అంతస్తు నుంచి నగ్నంగా కిందపడిపోయిన యువతి... అసలేం జరిగింది...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook