JNNURM and Vambay Scheme Houses: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జేఎన్ఎన్‌యూఆర్ఎం, వాంబే పథకాల కింద పేదలకు అందించిన ఇళ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం తరఫున 100 కోట్ల రూపాయలను కేటాయించింది. హెచ్ఎండీఏ అందించే 100 కోట్ల నిధులతో జీహెచ్ఎంసీ ఈ మరమ్మతు కార్యక్రమాలను పూర్తి చేయనుంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని దృష్టికి తీసుకువచ్చారు. పేదలు నివసించే ఈ కాలనీలలోని ఇళ్ల కోసం అవసరమైన నిధులను వారు వెచ్చించుకునే అవకాశం లేదని.. ప్రభుత్వమే వారికి అవసరమైన విధులను అందిస్తే బాగుంటుందన్న విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రూ.9100 కోట్లతో నిర్మించి పేదలకు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. కొన్ని నిధులతో వేల సంఖ్యలో పేదలకు లబ్ధి చేకూరుతుందంటే ప్రభుత్వం ఏ మాత్రం వెనకాడదన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన నిధులు మంజూరు చేశారు. 100 కోట్ల రూపాయల నిధులను పేదల ఇళ్ల మరమ్మతుల కోసం కేటాయిస్తున్నట్లు తెలిపారు కేటీఆర్. హెచ్‌ఎండీఏ ఇచ్చే నిధులతో ఈ మరమ్మతులను పూర్తి చేసేందుకు జీహెచ్‌ఎంసీ బాధ్యతలు తీసుకుంటుందని వెల్లడించారు.
నగరంలో జంగంమెట్, బండ్లగూడ వంటి పలు ప్రాంతాల్లో జేఎన్ఎన్‌యూఆర్‌ఎం, వాంబే కాలనీలు ఉన్నాయి. చాలా సంవత్సరాల క్రితం నిర్మాణమైన ఇక్కడి ఇళ్లు ప్రస్తుతం దెబ్బతిని ఉన్నాయి. వీటికి వెంటనే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు అవసరమైన 100 కోట్ల రూపాయలను జీహెచ్ఎంసీకి హెచ్ఎండీఏ అందించనుంది. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సిబ్బంది ఇందుకు సంబంధించిన మరమ్మతు పనులను పూర్తిచేస్తారు.
Also Read: SBI RD Interest Rates: ఎస్‌బీఐ ఆర్‌డీలో రూ.5 వేలు పెడితే.. రూ.55 వేలు లాభం.. ఎలాగంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.