Top Blood Donors felicitated by Telanagana Governor and Megastar: 'చిరంజీవి బ్లడ్ బ్యాంక్' ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ప్రముఖ రక్త దాతలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మెగాస్టార్ చిరంజీవి ఆదివారం సత్కరించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా 50 కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసిన 32 మందికి రాజ్‌భవన్‌లో గవర్నర్, మెగాస్టార్ సన్మానించారు. అంతేకాదు 'చిరు భద్రత'పేరుతో గవర్నర్ చేతుల మీదుగా వారికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి తెరపైనే కాకుండా రియల్ లైఫ్‌లో నిజమైన హీరో అని అన్నారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.... 'మెగాస్టార్ చిరంజీవి గారు తెరపైనే కాకుండా రియల్ లైఫ్‌లో నిజమైన హీరో. చిరు సామాజిక సేవ చేయడమే కాకుండా.. అసంఖ్యాక ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. ఒక వైద్యురాలిగా రక్తం కొరత ఎలా ఉంటుందో నాకు తెలుసు. రక్తదానం చేయడం చిన్న విషయం కాదు. నేను హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్న సమయంలో రోగులకు రక్తం ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాని రోజులు చూశా. రక్తదానం చేయమని ప్రజలను ఒప్పించడం ఎంత కష్టమో కూడా నాకు తెలుసు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అభిమానులను ప్రభావితం చేశారు. ఇది చాలా గొప్ప విషయం' అని అన్నారు.
'చిరంజీవి బ్లడ్ బ్యాంక్.. ఈ 25 సంవత్సరాలలో 9,30,000 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించడం అసాధారణం. ఈ రక్త యూనిట్లలో 79% పేదవారికి ఇచ్చారు. మిగిలిన యూనిట్లు నామమాత్రపు రుసుముతో కార్పొరేట్ ఆసుపత్రులకు అందించారు. 9,060 మంది అంధులు కార్నియా మార్పిడి ద్వారా ప్రయోజనం పొందారు. కరోనా సమయంలో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఏపీ, తెలంగాణ అంతటా ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయడం అద్భుతం. ఇక రక్తదానం చేసిన వారిలో ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తుంది. రాజ్‌భవన్ తరఫునా రక్తదాన కార్యక్రమాలు చేపడుతున్నాం. అవసరమైన వారికి సమయానికి రక్తం అందించేందుకు ఓ యాప్‌ను కూడా రూపొందించాం. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కూడా అందులో భాగం కావాలని కోరుకుంటున్నా' అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ... '1998వ సంవత్సరంలో రక్తం అందుబాటులో లేక చాలామంది చనిపోయారు. ఆ ఘటనలు నన్ను ఎంతగానో బాధించాయి. నా కోసం ఏదైనా చేసే అభిమానులు ఉన్నారు. వారి ప్రేమని నలుగురికి ఉపయోగ పడేలా మార్చాలనే ఉద్దేశంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించా. ఎప్పుడూ 2-3వేల మంది రక్తదానం చేస్తున్నారు. అలాంటి వారికి ఏదైనా భద్రత ఇవ్వాలనే ఉద్దేశంతో ‘చిరు భద్రత’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టా. త్వరలో ఆస్పత్రి కడతా' అని అన్నారు.
Also Read: రాత్రంతా సీలింగ్ ఫ్యాన్‌నే చూశా.. అర్ష్‌దీప్ సింగ్ మిసింగ్ క్యాచ్‌పై విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే?
Also Read: Samantha Uterus News: రెస్ట్ మోడ్ లో సమంత.. గర్భ సంచి తొలగించారా?.. అసలు ఏమైందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook