Chandrababu Sankranti Festival: అతి పెద్ద సంక్రాంతి పండుగకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే స్వగ్రామాలకు ప్రజలు తరలివెళ్లడంతో పల్లెటూళ్లు కళకళలాడుతున్నాయి. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు సంక్రాంతికి పండుగకు ముస్తాబయ్యాయి. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఈసారి సంక్రాంతికి పండుగకు దూరమవుతున్నట్లు సమాచారం. నారా కుటుంబసభ్యులు ఈ ఏడాది సంక్రాంతి పండుగ చేసుకునేటట్టు లేరు.
Also Read: Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాటలో కీలక పరిణామం.. నలుగురు ఆఫీసర్ల సస్పెండ్
నారా కుటుంబంలో ఈ ఏడాది తీవ్ర విషాదం ఏర్పడిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు గతేడాది నవంబర్ 16వ తేదీన కన్నుమూశారు. ఆ విషాదం నుంచి ఇంకా నారా కుటుంబం కోలుకోలేదు. ముఖ్యంగా చంద్రబాబు తన తమ్ముడి మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. అతడితో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు. ఈ క్రమంలో వచ్చిన సంక్రాంతి పండుగను నారా కుటుంబసభ్యులు చేసుకునే అవకాశం లేదు.
Also Read: Tirupati Stampede: 'ఏడుకొండలు వాడా... స్వామి మమ్మల్ని క్షమించు'
వాస్తవంగా హిందూ సంప్రదాయం.. పద్ధతుల ప్రకారం ఇంట్లో ఒకరు మృతి చెందితే దాదాపు ఏడాది వరకు ఎలాంటి పండుగలు చేసుకోరు. ఈ పద్ధతిని హిందూ ప్రజలు దాదాపుగా పాటిస్తారు. అదే పద్ధతి ప్రకారం చూస్తే నారా కుటుంబసభ్యులు ఈసారి సంక్రాంతి పండుగను చేసుకోకపోవచ్చు. అయితే పండితులు చెప్పే విధానం ప్రకారం పద్ధతులు మారవచ్చు. ఒక పరిహార పూజ చేస్తే ఆ సంప్రదాయం నుంచి విముక్తి లభిస్తుంటుంది. శాస్త్రం ప్రకారం చూస్తే చంద్రబాబు కుటుంబసభ్యులు సంక్రాంతి పండుగకు దూరమయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉండడంతో చంద్రబాబు ఏపీ ప్రజల కోసం సంక్రాంతి పండుగ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.
ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా చంద్రబాబు చిత్తూరు జిల్లాలోని స్వగ్రామం నారావారిపల్లికి చేరుకోనున్నారు. ఇప్పటికే నారా కుటుంబసభ్యులతోపాటు నందమూరి కుటుంబసభ్యులు నారావారిపల్లెకు చేరుకున్నారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరి, ఆమె సోదరు లోకేశ్వరి, తోటి కోడలు నారా ఇందిర, నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్, బాలకృష్ణ, వసుంధర తదితరులు ఆ గ్రామానికి విచ్చేశారు. వీరి రాకతో ఏది ఏమైనా సంక్రాంతి పండుగ నారావారిపల్లెకు ప్రత్యేక సందడి తీసుకురానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.