TS Govt: తెలంగాణలో డాక్టర్ చదవాలనుకునే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మైనార్టీ, నాన్ మైనార్టీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ బీ కేటగిరి సీట్లలో కేటాయించే 35 శాతం సీట్లలో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు దక్కేలా చర్యలు చేపట్టారు. ఈమేరకు అడ్మిషన్ల నిబంధనలను సవరిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వెయ్యి 68 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి.
రాష్ట్రంలో 20 నాన్ మైనార్టీ, 4 నాన్ మైనార్టీ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొత్తం 3 వేల 750 సీట్లు ఉన్నాయి. నాన్ మైనార్టీ కాలేజీల్లో 3 వేల 200 సీట్లు ఉన్నాయి. ఇందులో బీ కేటగిరి కింద 35 శాతం అంటే 1120 సీట్లు ఉన్నాయి. ఇప్పటివరకు వీటికి అన్ని రాష్ట్రాల విద్యార్థులకు అర్హత ఉంది. తాజాగా సవరణతో బి కేటగిరిలో ఉన్న 35 శాతం సీట్లలో 85 శాతం సీట్లు అంటే 952 సీట్లు ప్రత్యేకంగా తెలంగాణ వారికే కేటాయించనున్నారు.
మిగతా 15 శాతం సీట్లు మాత్రమే ఓపెన్ కోటాలో భర్తీ చేయనున్నారు. ఓపెన్ కోటాలో తెలంగాణ విద్యార్థులకు అవకాశం దక్కే వీలు ఉంది. వీటితోపాటు మైనార్టీ కాలేజీలో 25 శాతం బీ కేటగిరి కింద ఇప్పటివరకు 137 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తాజా ఉత్తర్వులతో ఇందులోనూ 85 శాతం అంటే 116 సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కనున్నాయి. ఈమేరకు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇప్పటివరకు తెలంగాణలో మేనేజ్మెంట్ కోటా సీట్లలో తెలంగాణ వారికి కోసం ప్రత్యేకంగా ఎలాంటి రిజర్వేషన్ కల్పించలేదు.
బీ కేటగిరిలో ఉన్న 35 శాతం కోటాలో ఎలాంటి లోకల్ రిజర్వేషన్ల లేకపోవడంతో ఇతర రాష్ట్రాల విద్యార్థులు అధికంగా చేరుతున్నారు. దీంతో తెలంగాణ వారికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టిన మంత్రి హరీష్‌రావు..ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయించారు. అక్కడ అమలు అవుతున్న విధానాలను నివేదిక రూపంలో అందించాలని ఆదేశించారు. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఓపెన్ కోటా లేదు.
గతేడాది నుంచి అన్ని సీట్లు ఆయా రాష్ట్రాల విద్యార్థులకు దక్కేలా నిబంధనలు తీసుకొచ్చారు. అలా తెలంగాణ విద్యార్థులకు మేలు చేయాలని భావించిన ప్రభుత్వం ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా 1068 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఎంబీబీఎస్ విద్య కోసం ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాలకు సైతం తెలంగాణ విద్యార్థులు వెళ్తున్నారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ విద్యార్థులు ఇక్కడే చదవనున్నారు.
Also read:Supreme Court: భార్యను బలవంతం చేసినా అత్యాచారమే.. అబార్షన్ చట్టబద్దమే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
Also read:సినిమా సూపరంటూ ఫస్ట్ రివ్యూయర్ హల్చల్.. అసలు నువ్వెవరంటూ షాకిచ్చిన సుహాసిని!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి