Telangana Exit Poll District Wise Results: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ యుద్ధం ముగిసింది. 119 అసెంబ్లీ స్థానాలకు గురువారం తెలంగాణ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో ఓటర్లు భద్రపరిచారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు 70.66 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకా పూర్తిస్థాయిలో రిపోర్ట్ వెల్లడికావాల్సి ఉంది. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. సర్వత్రా ఉత్కంఠ రేపిన సర్వే ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేలింది. ఎక్కువ సర్వేలు కాంగ్రెస్‌కు మొగ్గు చూపగా.. కొన్ని సర్వేల్లో బీఆర్ఎస్ పార్టీ పట్టం కట్టారు. మరికొన్ని సర్వేల్లో హంగ్ ఏర్పడుతుందని తేలింది. అయితే ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందని అందరిలోనూ ఆసక్తి ఉంది. గ్రౌండ్ లెవల్‌లో ఓటరు మాట ఎలా ఉంది..? ఎవరు గెలిచే అవకాశం ఉంది..? గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ మెదక్ జిల్లాల ఎగ్జిట్ పోల్స్ వివరాలు మీ కోసం.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో..
గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 24 సీట్లలో 16 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని టైమ్స్ నౌ సర్వేలో తేలింది. ఎంఐఎం 5 నుంచి 6 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది. నాంపల్లి, మలక్‌పేట్‌లో ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య బిగ్‌ఫైట్ ఉన్నా.. కాంగ్రెస్‌కు కాస్త ఆధిక్యం లభించే అవకాశం ఉందని తేలింది. సికింద్రాబాద్ బీఆర్ఎస్, గోషామహల్ బీజేపీ, మహేశ్వరం బీజేపీ, ఎల్బీ నగర్‌లో బీఆర్ఎస్, అంబర్‌పేట బీఆర్ఎస్, ఖైరతాబాద్‌లో టఫ్ ఫైట్ ఉంది. జూబ్లీహిల్స్, ముషీరాబాద్, శేరిలింగంపల్లి, సనత్ నగర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కజ్‌గిరి, మేడ్చల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆధిక్యం సాధించే అవకాశం ఉంది. రాజేంద్ర నగర్‌లో బీజేపీకి కాస్త ఎడ్జ్ ఉంది. మహేశ్వరంలో బీఆర్ఎస్‌కు విజయ అవకాశాలు ఉన్నాయి. తాండూర్, చేవెళ్ల, వికారాబాద్ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌కు ఆధిక్యంలో నిలిచే ఛాన్స్ ఉంది. పటాన్‌చెరులో భారీ పోరు నెలకొంది. నలుగురు బరిలో ఉన్నారు. కాటం శ్రీనివాస్ గౌడ్ కాస్త ఆధిక్యంలో నిలిచే అవకాశం ఉంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇలా..
సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు గెలవనున్నారు. గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌పై సీఎం కేసీఆర్ విజయం సాధించనున్నారు. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు గెలుపు అవకాశాలు ఉన్నాయి. సంగారెడ్డిలో జగ్గారెడ్డి (కాంగ్రెస్), ఆంధోల్‌లో దామోదరం నర్సింహ (కాంగ్రెస్) ఆధిక్యంలో నిలిచే ఛాన్స్ ఉంది. జహీరాబాద్‌లో కాంగ్రెస్‌కే గెలుపొందే అవకాశం ఉంది. మెదక్ మైనంపల్లి రోహిత్ వైపు ఓటర్లు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. నర్సాపూర్‌లో సునీతా లక్ష్మారెడ్డి గెలుపు కష్టంగా ఉంది. నారాయణఖేడ్‌లో సంజీవరెడ్డి (కాంగ్రెస్) గెలిచే ఛాన్స్ ఉంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా అందరికీ కళ్లు సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డిపై ఉంది. అయితే ఇక్కడ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్ మూడోస్థానంలో ఉంటారంటూ ప్రచారం జరుగుతోంది. వెంకటరమణారెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వెంకటరమణారెడ్డికి ఆధిక్యం సాధించే అవకాశం ఉంది. జుక్కల్‌లో బీఆర్ఎస్, ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి మదన్‌మోహన్ రావు (కాంగ్రెస్), బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి (బీఆర్ఎస్) ఆధిక్యంలో నిలిచే అవకాశం ఉంది. నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్, బీజేపీ బిగ్‌ఫైట్ ఉంటుంది. కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ ఉంది. ఆర్మూర్‌లో హోరాహోరీ ఉంటుంది. నిజామాబాద్ రూరల్‌లో బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి (బీఆర్ఎస్), బోధన్‌లో కాంగ్రెస్ ఆధిక్యం కనబర్చే అవకాశం ఉంది. బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
(మిగిలిన జిల్లాల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయంది.. పార్ట్-1, పార్ట్-2)
Also Read: Telangana Exit Poll Result 2023: అసెంబ్లీ స్థానాల వారీగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే.. ఏ నియోజకవర్గంలో గెలుస్తారు..? (పార్ట్-1)
Also Read: Telangana Exit Poll Result 2023: అసెంబ్లీ స్థానాల వారీగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే.. ఏ నియోజకవర్గంలో గెలుస్తారు..? (పార్ట్-2)