Palm Oil Factory in Siddipet District: తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులు వేగవంతంగా చేయాలని హరీశ్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచేలా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేట జిల్లాలోని నర్మెట గ్రామంలో జరుగుతున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులను శుక్రవారం పరిశీలించారు. ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పామాయిల్ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడమే కాకుండా రిఫైనరీని పెట్టి ఫైనల్ ప్రొడక్ట్‌ను నేరుగా మార్కెట్లోకి పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. దీనికి కావాల్సిన 4 మెగావాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
మూడేళ్ల కిందట పామాయిల్ పంటను పెట్టిన రైతుల నుంచి ఈ జూన్ వరకు పంట దిగుబడి రానుందని హరీశ్ రావు తెలిపారు. రానున్న జూన్‌లో పంట ఉత్పత్తి ప్రారంభం కానుందని చెప్పారు. పంట కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన పంటను తోట నుంచి ఫ్యాక్టరీ వరకు దారిలో అయ్యే ఖర్చులన్నీ పామాయిల్ ఫ్యాక్టరీనే చెల్లిస్తుందని వివరించారు.
Also Read: Telangana: జెండా వేడుకలో ఊహించని ఘటన.. స్పృహతప్పి పడిపోయిన మాజీ హోమ్ మంత్రి..
కేంద్ర ప్రభుత్వం మెట్రిక్ టన్నుకు కనీసం రూ.15 వేలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్లు హరీశ్ రావు తెలిపారు. ఆపైన కూడా మద్దతు ధర ఇస్తే రైతులకు ఎంతో మేలు కలుగుతుందని పేర్కొన్నారు. పామాయిల్ రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని తమకు జూన్ నుంచి పామాయిల్ ఫ్యాక్టరీనే పంటలను కొనుగోలు చేసి అశ్వరావుపేటకు పంపిస్తామని భరోసా ఇచ్చారు. సిద్దిపేటలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్‌కు చెందిన అధికారిని కూడా అపాయింట్ చేస్తామని హరీశ్ రావు తెలిపారు.
Also Read: KTR Viral Tweet: సంచలనం రేపుతోన్న కేటీఆర్ ట్విట్టర్ పోస్ట్.. రాష్ట్రరాజకీయాల్లో తీవ్రచర్చ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook