Telangana: లాక్‌డౌన్ తీవ్రతరం.. రేపటి నుంచి కఠినమైన ఆంక్షలు

తెలంగాణలో లాక్‌డౌన్ (Lockdown in Telangana) మే 7వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్న తీరుపై రాష్ట్ర డీజీపి మహేందర్ రెడ్డి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసేందుకు పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు.

Last Updated : Apr 21, 2020, 06:21 AM IST
Telangana: లాక్‌డౌన్ తీవ్రతరం.. రేపటి నుంచి కఠినమైన ఆంక్షలు

హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్ (Lockdown in Telangana) మే 7వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్న తీరుపై రాష్ట్ర డీజీపి మహేందర్ రెడ్డి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసేందుకు పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. లాక్ డౌన్ రోజులు పెరుగుతున్న నేపథ్యంలో రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య పెరిగింది. రేపటి నుంచి లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తాం. నిత్యవసర సరుకులు, ఐటీ సహా పలు అత్యవసర రంగాల ఉద్యోగులకు కొన్ని పాస్‌లు (COVID-19 pass) ఇచ్చాము. వాటిని మళ్ళీ రివ్యూ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అత్యవసర పరిస్థితుల కోసం పాస్‌లు ఇస్తే.. వాటిని కొంతమంది మిస్‌యూస్ చేస్తున్నారు. Also read : ఏపీకి రూ.1,892.64 కోట్లు, తెలంగాణకు 982 కోట్లు

రూట్ పాస్‌ని అలా దుర్వినియోగం చేసే వారిపై చర్యలు:
పాసులను దుర్వినియోగంను దృష్టిలో పెట్టుకుని పాసులను రివ్యూ చేయాలని నిర్ణయించుకున్నాం. పాసులు ఇచ్చిన రూట్‌లో కాకుండా మరో రూట్‌లో వెళ్తూ పట్టుబడితే వారి పాస్‌ను రద్దు చేయడంతోపాటు వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం రూట్ మ్యాప్ ప్రకారమే పాస్‌లను జారీ చేస్తామని డీజీపి మహేందర్ రెడ్డి (Telangana DGP Mahender Reddy) తెలిపారు. Also read : Coronavirus updates: 24 గంటల్లో 1,553 కేసులు నమోదు, 36 మంది మృతి

ఇంటి అడ్రస్ తప్పనిసరి.. అది కూడా 3 కిలో మీటర్లలోపే:
రోజూ నిత్యవసర సరుకుల వాహనాలు అందుబాటులో ఉంటున్నాయి. అవి కాకుండా నిత్యవసరాల సరుకులు (Ration) కొనుక్కోవాలనుకునే వారు 3 కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లరాదు. సరుకులు కొనడానికి బయటికి వచ్చే ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా తమ ఇంటి అడ్రస్ వెంట పెట్టుకోవాలి (House address). ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. Also read : తెలంగాణలో కరోనా కాటుకు మరో ఇద్దరు మృతి

ఆస్పత్రికి వెళ్లాల్సి  వస్తే..
తప్పనిసరి పరిస్థితుల్లో ఆస్పత్రికి (Visiting hospitals during lockdown) వెళ్లాల్సి వస్తే.. వాళ్లు కూడా ఇంటి అడ్రెస్‌ని వెంట పెట్టుకునే వెళ్ళాలి. సాధారణ చికిత్స కోసం అయితే దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి మాత్రమే వెళ్ళాలి. ప్రజలందరూ ఈ నిబంధనలు (Lockdown rules) పాటించి లాక్‌డౌన్‌కి సహకరించాలని డీజీపీ మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News