హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. తెలంగాణలో బుధవారం రాత్రి 8 గంటల వరకు తాజాగా 1,931 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 86,745కి చేరింది. బుధవారం ఒక్కరోజే 11 మంది కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 665కి చేరింది. నిన్న ఒక్కరోజే 1,780 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. హెచ్1బీ వీసాదారులకు అమెరికా శుభవార్త
ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 298 కరోనా పాజిటివ్ కేసులు (COVID19 Cases In GHMC) నమోదయ్యాయి. జిల్లాలవారీగా చూస్తే.. వరంగల్ అర్బన్‌లో 144, రంగారెడ్డి జిల్లాలో 124, కరీంనగర్ జిల్లాలో 89, సంగారెడ్డిలో 86, నల్గొండలో 84, ఖమ్మంలో 73, మల్కాజ్గిరి, సిద్దిపేట జిల్లాల్లో 71, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 64, నాగర్‌కర్నూల్, నిజామాబాద్ జిల్లాల్లో 53 కోవిడ్19 కేసులు నిర్ధారించారు. తల్లి పాలతో కరోనా సోకుతుందా? ఏ జాగ్రత్తలు పాటించాలి
COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే