తెలంగాణలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు (Telangana CoronaVirus Cases), మరణాలు నమోదవుతున్నా ప్రభుత్వం లెక్కలు తక్కువగా చూపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో సోమవారం 1,286 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 68,946కు చేరింది. అదే సమయంలో నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 12 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 563కి చేరింది. కరోనాతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే మృతి
నిన్న ఒక్కరోజే ఏకంగా 1066 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 49,675కు చేరగా, రాష్ట్రంలో ప్రస్తుతం 18,708 యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణలో కరోనా పరీక్షలు 5 లక్షలు (5,01,025) దాటడం గమనార్హం. పొరుగు రాష్ట్రం ఏపీలో ఇంతకు నాలుగు రెట్లు కోవిడ్19 టెస్టులు జరిపారు. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు కరోనా
తాజా కేసులలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 391 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. రంగారెడ్డిలో 121, కరీంనగర్‌లో 101, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 72, వరంగల్ అర్బన్ 63, నిజామాబాద్ 59, జోగులాంబ గద్వాల 55, ఖమ్మం 41, మహబూబ్ నగర్ 39, భద్రాద్రి కొత్తగూడెంలో 38, నల్గొండ 29, నాగర్‌కర్నూలులో 29 మంది తాజాగా కరోనా బారిన పడ్డారు. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...
ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos
Telangana: కరోనా పంజా.. ఒకేరోజు 12 మంది మృతి