Nagarjuna Vs Revanth Reddy: నాగార్జునను... రేవంత్ అప్పుడే టార్గెట్ చేశారా..?

Nagarjuna Vs Revanth Reddy: ప్రస్తుతం తెలంగాణ అక్రమ కట్టడాల కూల్చివేతలు నడుస్తోంది. ఈ నేపథ్యంలో హైటెక్ సిటీ సమీపంలో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంపై మీడియా అటెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి.. నాగార్జునను అపుడే టార్గెట్ చేశారా.. ? అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 25, 2024, 09:25 AM IST
Nagarjuna Vs Revanth Reddy: నాగార్జునను... రేవంత్ అప్పుడే టార్గెట్ చేశారా..?

Nagarjuna Vs Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాకా రేవంత్ రెడ్డి.. అక్రమ నిర్మాణాలపై కొరడా ?ఝళిపిస్తున్నారు. ఇందుకోసం హైడ్రా (హైదరాబాద్  డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) రంగంలోకి దిగి.. నగరంలో చెరువులు, కుంటలున్న ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో అక్రమంగా కట్టిన కట్టడాలను కూల్చి వేసే పనిలో పడింది. అయితే ఈ కూల్చివేతలపై రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమకు అనుకూలంగా లేని రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికే ఈ కూల్చివేతలను రేవంత్ రెడ్డి చేపట్టినట్టు ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తన్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన ఋణ మాఫీ పూర్తి స్థాయిలో కాకుండా పరిమితంగా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. వాటి నుంచి దృష్టి మరలించడానికే రేవంత్ రెడ్డి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అంతేకాదు రేవంత్ రెడ్డి అంతా దమ్ము ఉంటే.. తమ పార్టీకి చెందిన నేతల అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని ప్రత్యర్థి పార్టీలు సవాల్ విసురుతున్నాయి. అంతేకాదు ముఖ్యంగా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అప్పటి ప్రభుత్వ అధికారులు, నేతలపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా నగరంలో చెరువులు, కుంటలు ప్రవహించే ప్రదేశాల్లో అక్రమ కట్టడాలు కట్టిన ప్రతీది కూల్చివేయాలి. ఇందులో వేరే ప్రశ్నే లేదు. ఇందులో అస్మదీయులు, తస్మదీయులు అంటూ తమ వారికి ఒక న్యాయం. అవతలి వారికీ ఒక న్యాయం ఉండకూడదంటున్నారు.

ఇక నాగార్జున కూడా గతంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి గా ఉన్న కేసీఆర్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. మరోవైపు కేటీఆర్ కు మంచి మిత్రుడు. అటు  ఏపీ మాజీ సీఎం జగన్ కు కూడా నాగార్జున అత్యంత ఆప్తుడుగా పేరు పొందారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో ప్రభుత్వాలు మారాయి. అక్కడ చంద్రబాబు.. ఇక్కడ ఆయన శిష్యుడు కమ్ సహచరుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు. అంతేకాదు ఆయా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత నాగార్జున నామ మాత్రంగా విష్ చేసాడు. కానీ పర్సనల్ గా అంత ర్యాపో మెయింటెన్ చేయలేదు. అప్పట్లో నగరంలో అక్రమంగా కట్టిన కట్డడాలపై రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తన గళం వినిపించారు. ఇపుడు అధికారంలోకి రావడంతో ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉన్న నాగార్జున కు తన పవర్ రుచి ఏంటో చూపించాడు రేవంత్.  

ముఖ్యంగా హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌లోని అక్రమ కట్టడాలను  హైడ్రా అధికారులు కూల్చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హీరో నాగార్జునకు సంబంధించిన కట్టడం కాబట్టి ఇది వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం  తెలంగాణ, ఏపీలో ఎక్కడ చూసినా నాగార్జున భవనం కూల్చివేత గురించే చర్చ. అక్రమ కట్టడాలపై పంజా విసురుతున్న  హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా  తన విశ్వరూపం చూపించింది. 2015 నుంచి N కన్వెన్షన్ సెంటర్ ఆక్రమణలో ఉన్న తుమ్మడిగుంట చెరువును రక్షించింది.

అక్రమ కట్టడాన్ని కూల్చేసిన హైడ్రా అధికారులకు జనాల నుంచి అభినందనలు వస్తున్నాయి. ఎన్ కన్వెన్షన్ తరహాలోనే చెరువు భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను రాజకీయాలకు అతీతంగా నేలమట్టం చేయాలనే డిమాండ్లు జనాల నుంచి వస్తున్నాయి. కేవలం నాగార్జునకు సంబంధించిన కట్టడమే కాదు.. ఎవరు అక్రమాలకు పాల్పడిన వారిపై హైడ్రా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో.. ఆ నిర్మాణంపైనా రకరకాల చర్చలు సాగుతున్నాయి. హీరో నాగార్జున ఆ కట్టడాన్ని ఎప్పుడు కట్టారు.. ఎన్ని ఎకరాల్లో కట్టారు.. అందులో చెరువు భూమి ఎంత.. ఆ నిర్మాణానికి ఎవరూ అనుమతి ఇచ్చారు.. ఇప్పుడెందుకు కూల్చేశారు.. ఈ అంశాలే ఆసక్తిగా మారాయి.

హైదరాబాద్  సైబర్ టవర్స్ ఎదురుగానే ఉంది నాగార్జున N కన్వెన్షన్ సెంటర్.  హైటెక్ సిటీ జంక్షన్‌లో వేల కోట్ల విలువైన 10 ఎకరాల విస్తర్ణంలో దీన్ని నిర్మించారు. 2015లో హీరో నాగార్జున N కన్వెన్షన్ నిర్మించారు. అప్పటి నుంచి ఈ కట్టడంపై వివాదం కొనసాగుతూనే ఉంది. నాగార్జున ఎన్ కన్వెన్షన్ లో వందలు, వేల కోట్ల డబ్బున్నోళ్ల ఫంక్షన్స్ జరుగుతుంటాయి. అటు రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి కూడా ఇందులోనే జరిగింది.  భారీ ఎత్తున సెట్టింగ్స్ వేస్తూ విలాసవంతమైన వేడుకలకు అడ్డాగా మారిన..
ఈ N కన్వెన్షన్ సెంటర్ మొత్తం 10 ఎకరాల్లో విస్తరించి ఉంది.

నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించిన 10 ఎకరాల్లో తుమ్మటికుంట చెరువు ఆక్రమణ భూమి 3.5 ఎకరాలు. ఇందులో ఒక ఎకరా 12  సెంట్లు చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్  FTLలో ఉండగా... మరో రెండు ఎకరాలు బఫర్‌ జోన్‌ లో ఉంది. తుమ్మిడికుంట చెరువు మొత్తం విస్తీర్ణం 29 ఎకరాలు. ఇందులో హీరో నాగార్జున ఆక్రమించింది 3.5 ఎకరాలు. తుమ్మడికుంట చెరువు ఆక్రమణలో రెండు పెద్ద హాల్స్, ఇతర శాశ్వత నిర్మాణాలు ఉన్నాయి. తుమ్మడికుంట చెరువు FTLకు 25 మీటర్లలోనే   N కన్వెన్షన్ కట్టారు.. నిబంధనల ప్రకారం 30 మీటర్ల ఎత్తులో ఉండాలి.. ఇప్పుడు ఆ చెరువు ఆక్రమణలో ఉన్న నిర్మాణాలనే హైడ్రా కూలగొట్టింది. కూల్చివేతల తర్వాత N కన్వెన్షన్ పరిధి కేవలం 6.5 ఎకరాలకు పరిమితమైంది.

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News