CM KCR on COVID-19 : కరోనాకు భయపడాల్సిన పనిలేదు : సీఎం కేసీఆర్

కరోనావైరస్ వ్యాప్తి (Coronavirus ) విషయంలో ప్రజలు భయపడాల్సిన పనిలేదని, లాక్ డౌన్ నిబంధనలు ( Lockdown rules ) సడలించినప్పటికీ వైరస్ వ్యాప్తి మరీ అంత ఉధృతంగా ఏమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( Telangana CM KCR ) అన్నారు. అయితే అదే సమయంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉందని ఆయన రాష్ట్ర ప్రజలకు సూచించారు.

Last Updated : May 28, 2020, 06:15 AM IST
CM KCR on COVID-19 : కరోనాకు భయపడాల్సిన పనిలేదు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : కరోనావైరస్ వ్యాప్తి (Coronavirus ) విషయంలో ప్రజలు భయపడాల్సిన పనిలేదని, లాక్ డౌన్ నిబంధనలు ( Lockdown rules ) సడలించినప్పటికీ వైరస్ వ్యాప్తి మరీ అంత ఉధృతంగా ఏమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( Telangana CM KCR ) అన్నారు. అయితే అదే సమయంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉందని ఆయన రాష్ట్ర ప్రజలకు సూచించారు. ప్రస్తుతం వెలువడుతున్న అధ్యయనాల ప్రకారం రాబోయే రెండు, మూడు నెలల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (COVID-19 cases) మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోందని.. ఒకవేళ అలా పెరిగినప్పటికీ, తగిన వైద్య సేవలు అందించడానికి వైద్య, ఆరోగ్య శాఖ సంసిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. అవసరమైన పిపిఇ కిట్లు ( PPE kits ), టెస్టు కిట్లు ( COVID-19 Test kits ), మాస్కులు (Masks ), బెడ్స్, వెంటిలేటర్లు ( Ventilators ), ఆసుపత్రులు ( COVID-19 hospitals in Telangana ) అన్నీ సిద్ధంగా ఉన్నాయని చెబుతూ.. వైరస్ సోకిన వారిలో ఎవరికైనా ఆరోగ్యం బాగా క్షీణిస్తే అత్యవసర వైద్యం అందించాలని ఆయన వైద్యాధికారులను కోరారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ( Read also : Telangana COVID-19 Updates : తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు )

ఈ సందర్భంగా కోవిడ్ -19 విషయంలో ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు, తాజా పరిస్థితిని ముఖ్యమంత్రి, మంత్రులకు వైద్యశాఖ అధికారులు, వైద్య నిపుణులు వివరించారు. ''కరోనా విషయంలో అంతగా భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతున్నది. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం వైరస్ సోకిన తర్వాత కూడా అత్యధిక శాతం మందిలో కనీసం వ్యాధి లక్షణాలు కూడా కనిపించడం లేదు. వైరస్ సోకిన వారిలో 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వారికి ఎలాంటి వైద్యం కూడా అవసరం లేదు. 15 శాతం మందిలో జలుబు, జ్వరం, దగ్గు, దమ్ము లాంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయని తెలిపారు. ఐతే, 5 శాతం మందిలో మాత్రం వ్యాధి లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. వీరి విషయంలోనే ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుందని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కోవిడ్-19 వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిలోంచే మరణించే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని వారు వివరించారు. ( TDP Mahanadu 2020 : టిడిపి మహానాడు 2020 ప్రారంభం.. మహానాడుకు ప్రత్యేక ఏర్పాట్లు )

మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంత కుమారి, రామకృష్ణా రావు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కరుణాకర్ రెడ్డి, డిఎంఇ రమేశ్ రెడ్డి, డిపిహెచ్ శ్రీనివాస్, మెడికల్ హెల్త్ సలహాదారు గంగాధర్ తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News