Telangana: వైఎస్ఆర్, జగన్‌లపై ప్రశంసల వెనుక కేసీఆర్ వ్యూహమిదే

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రికి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యల వెనుక పెద్ద రాజకీయమే కన్పిస్తోంది. ఎన్నికల వేళ అందరి అభిమానాన్ని మూటగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 6, 2023, 06:55 PM IST
Telangana: వైఎస్ఆర్, జగన్‌లపై ప్రశంసల వెనుక కేసీఆర్ వ్యూహమిదే

Telangana: నిన్న తనయుడు కేటీఆర్..ఇవాళ తండ్రి కేసీఆర్. ఇద్దరి నోట వైఎస్ఆర్, వైఎస్ జగన్ నామస్మరణ..ఇదేదో కాకతాళీయంగా జరిగింది కానేకాదు. వ్యూహం ప్రకారం చేసిన వ్యాఖ్యల్లానే కన్పిస్తున్నాయి. ఎన్నికల వేళ టీఆర్ఎస్ నేతలకు ఇది అవసరం కూడా. అసలేం జరిగిందంటే..

తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా రెండ్రోజులు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎప్పుడు ఏం చేయాలో, ఎవరిని ఎలా ఆకట్టుకోవాలో, ఎప్పుడు ఏది అవసరమౌతుందో ఈ నేతలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనుకుంటా. అందుకే తెలంగాణపై వరుసగా రెండుసార్లు అధికారం చేజిక్కించుకున్నారు. మూడోసారి పగ్గాలు చేపట్టేందుకు సిద్దమౌతున్నారు. తెలంగాణలో మరో 2-3 నెలల్లో ఎన్నికలున్నాయి. అటు ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీతో పాటు వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ కూడా టీఆర్ఎస్‌కు సవాలు విసురుతున్నాయి. 

అందుకే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సాక్షిగా నిన్న కేటీఆర్, ఇవాళ కేసీఆర్ హఠాత్తుగా వైఎస్ఆర్, వైఎస్ జగన్‌లను ప్రశంసించడం ప్రారంభించారు. నిన్న అసెంబ్లీలో కేటీఆర్ వైఎస్ జగన్ పేరుని ప్రస్తావించారు. దిశ సంఘటన అనంతరం తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి జగన్ ఏపీ అసెంబ్లీలో గుర్తు చేసుకున్నారని, కేసీఆర్‌కు నిండుసభలో సెల్యూట్ చేశారని చెప్పారు. అదే సమయంలో తెలంగాణకు కొందరు ముఖ్యమంత్రులు మంచి కూడా చేశారని..వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీని అమలు చేయడం వల్ల లక్షలాదిమందికి మంచి జరుగుతోందని ప్రశంసించారు

ఇవాళ కేసీఆర్ సైతం తన ప్రసంగంలో వైఎస్ జగన్ పేరుని ప్రస్తావించారు. వైఎస్ఆర్ మరణానంతరం అతని కుమారుడు జగన్‌ని కాంగ్రెస్ పార్టీ ఎన్నోరకాలుగా వేధింపులకు గురి చేసిందన్నారు. ఆ తరువాత సొంతంగా పార్టీ స్థాపించి రికార్డు స్థాయి మెజార్టితో విజయం దక్కించుకున్నారని కీర్తించారు. కడప లోక్‌సభ ఉపఎన్నికల్లో సైతం 5 లక్షలకు పైగా మెజార్టీతో విజయం దక్కించుకున్నారన్నారు. 

నిన్న కేటీఆర్, ఇవాళ కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎవో అలవోకగా చేసినవి కావని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటికీ వైఎస్ఆర్, వైఎస్ జగన్ అంటే అభిమానించే ప్రజలు లక్షల్లో ఉన్నారు. ఎన్నికల వేళ వైఎస్ అభిమానులకు గాలం వేసేందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల కొద్దికాలంగా తెలంగాణ కాంగ్రెస్ వైఎస్ఆర్ పేరు ప్రస్తావిస్తుండటంతో..దానికి చెక్ పెట్టేందుకు కూడా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

Also read: Gaddar Passed Away: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత.. విషాదంలో తెలంగాణ లోకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News