Telangana Budget Session 2022: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు నిర్వహించడంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని ఆరోపిస్తూ సభలో పాయింట్ ఆర్డర్ లేవనెత్తారు. ఇందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అనుమతించకపోవడంతో కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
గతేడాది జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కొనసాగింపుగా తాజా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా గవర్నర్ ప్రసంగానికి అవకాశం లేనట్లయింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. గవర్నర్ ప్రసంగం ఉంటే ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంతోనే అందుకు అవకాశం లేకుండా చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే.
కేంద్రంపై సీఎం కేసీఆర్ యుద్దం ప్రకటించడం.. కొంత కాలంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌తో ప్రభుత్వానికి గ్యాప్ పెరగడంతో.. ఈ సారి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా.. రాజ్యాంగ నిబంధనలకు లోబడే తాము నడుచుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది.
కాంగ్రెస్ సభ్యుల వాకౌట్‌కి ముందు బీజేపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. సమావేశాలు ముగిసేవరకూ వారిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగానికి అడ్డు తగలడంతో వారిని సస్పెండ్ చేశారు.
Also Read: TS Budget 2022: తెలంగాణ బడ్జెట్ రూ.2.56 లక్షల కోట్లు- హైలైట్స్ ఇవే
Also Read: Pooja Hegde: మా జంట బాగుందని చెబుతున్నారు.. పెళ్లెప్పుడని ప్రభాస్‌ను నేను కూడా అడిగా: పూజా హెగ్డే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook