BJP Public Meeting At Sangareddy: సంగారెడ్డి ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ నేత పులిమామిడి రాజు, ఆయన అనుచరులు సోమవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చిందని.. వచ్చే 90 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఈ రాష్ట్ర ప్రజల కోసం.. దేశం కోసం పనిచేసే వ్యక్తులు కావాలా..? కుటుంబాల కోసం పనిచేసే వ్యక్తులు కావాలా..? ఆలోచించాల్సిన సందర్భం ఇది అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే.. కేసీఆర్, కేటీఆర్ వారి కుటుంబసభ్యుల కోసం ఓటు వేసినట్టు అని.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. సోనియా, రాహుల్, ప్రియాంక కోసం వేసినట్లు అవుతుందన్నారు.
"ఈ రెండు పార్టీలు కుటుంబ, అవినీతి పార్టీలు. గతంలో కాంగ్రెస్ అనేక కుంభకోణాలకు పాల్పడింది. ఈ రాష్ట్రంలో 9 ఏండ్లుగా ఎలాంటి అవినీతి, కుంభకోణాలకు పాల్పడుతున్నదో చూస్తున్నాం. ఈ దేశంలో అత్యంత ధనిక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అత్యంత నియంతృత్వ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతికి కొమ్ముకాసే పార్టీలు. నా నాయకత్వంలో పనిచేస్తే.. దేశంలో అన్ని పార్టీల ఖర్చు నేను పెట్టుకుంటానని కేసీఆర్ అన్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్.. నీకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది..? తెలంగాణ ప్రజల రక్తం, చెమల డబ్బే కదా అది.
తెలంగాణ కోసం ఎందరో బలిదానాలు చేసుకున్నారు. అనేక త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బంధీ అయింది.
ఒక కుటుంబం చేతిలో పెట్టేందుకా.. 1200 మంది చనిపోయింది..? నేను ముఖ్యమంత్రిని, నా తర్వాత నా కొడుకు, తర్వాత నా మనువడు ముఖ్యమంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు.. ఇదేమన్న నిజాం పాలననా..? ప్రజలు ఆలోచించాలి. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఈరోజు నయా నిజాం చేతిలో ఉంది. మజ్లిస్ పార్టీ అధినేత అంటున్నాడు.. కుర్చీలో కేసీఆర్ కూర్చున్నా.. బీఆర్ఎస్ కారు స్టీరింగ్, బ్రేక్, ఎస్క్‌లేటర్ నా చేతిలో ఉందని అంటున్నాడు.
కేసీఆర్, అసదుద్దీన్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించి దోచుకుంది. బీఆర్ఎస్కు ఓటేసినా.. కాంగ్రెస్‌కు వేసినట్టే.. కాంగ్రెస్‌కు ఓటేసినా.. బీఆర్ఎస్కు ఓటేసినట్లే.. ఈ రెండు పార్టీలకు ఓటేసినట్టే.. ముస్లింల బూచి చూపతూ.. అధికార పార్టీల అండలతో మత కలహాలు సృష్టించే పార్టీ మజ్లీస్ పార్టీ. మజ్లిస్ పార్టీని ఎదుర్కొనే శక్తి, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు లేదు. ఈ రెండు పార్టీలు.. మజ్లిస్ ముందు జీహుజూర్ అంటాయి.." అని కిషన్ రెడ్డి విమర్శించారు.
ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే.. మజ్లిస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ అరాచకాలు పోవాలంటే మోడీ నేతృత్వంలోని బీజేపీ రావాలని అన్నారు. కేసీఆర్ దుందుడుకు చర్యలతో రాష్ట్రం అప్పులపాలైందన్నారు. మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే... తెలంగాణ ప్రజల చేతిలో చిప్పపెడ్తాడు కేసీఆర్ అని అన్నారు. లిక్కర్, మైనింగ్, శాండ్ మాఫియా రాష్ట్రంలో ఉందన్నారు. ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని.. కేసీఆర్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడుకోవాలన్నారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.
Also Read: Indian Railways: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రేపు ఈ మార్గంలో విస్టాడోమ్ ట్రైన్ ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook