BJP, Janasena alliance: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై బీజేపి క్లారిటీ

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీతో బీజేపికి పొత్తు ఉంటుందా అనే ప్రశ్నకు తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టత ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అసదుద్దిన్ ఒవైసి నేతృత్వంలోని ఎంఐఎం పార్టీనే తమ పార్టీకి ప్రధాన ప్రత్యర్ధి అని ఆయన తేల్చిచెప్పారు.

Last Updated : Nov 18, 2020, 08:28 AM IST
BJP, Janasena alliance: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై బీజేపి క్లారిటీ

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీతో బీజేపికి పొత్తు ఉంటుందా అనే ప్రశ్నకు తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టత ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని తెలిపారు. బీజేపీతో జనసేన పొత్తు అనేది ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం అని, అది తెలంగాణకు వర్తించదు అని బండి సంజయ్ స్పష్టంచేశారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అసదుద్దిన్ ఒవైసి నేతృత్వంలోని ఎంఐఎం పార్టీనే తమ పార్టీకి ప్రధాన ప్రత్యర్ధి అని ఆయన తేల్చిచెప్పారు. 

Also read : Theatres reopening: థియేటర్స్‌కి అనుమతి.. షరతులు వర్తిస్తాయి

పొత్తుల విషయంలో ఇప్పటివరకు ఏ పార్టీ కూడా తమను సంప్రదించలేదన్న బండి సంజయ్ ( Bandi Sanjay kumar ) .. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని 150 డివిజన్లలో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News