Telangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు, ఖమ్మంలో మళ్లీ అతి భారీ వర్షాల హెచ్చరిక

Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాల్ని భారీ వర్షాలు వీడటం లేదు. ఒకరోజు విరామం తరువాత తిరిగి వర్షాలు మొదలయ్యాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం నమోదైంది. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 4, 2024, 08:10 AM IST
Telangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు, ఖమ్మంలో మళ్లీ అతి భారీ వర్షాల హెచ్చరిక

Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినా మరో అల్పపీడనం పొంచి ఉండటంతో పాటు ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ నెల 5వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం తుపానుగా మారనుండటంతో రానున్న 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. 

తెలంగాణలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. సిద్ధిపేట జిల్లాలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తర హైదరాబాద్ ప్రాంతంలో నిన్న 8-9 సెంటీమీటర్లు వర్షం కురిసింది. నిన్న రాత్రి 8.30 గంటల నుంచి ఇవాళ ఉదయం 7 గంటల వరకూ తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలను తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. సిద్ధిపేట జిల్లా కోహెదలో అత్యధికంగా 223.5 మిల్లీమీటర్లు, సముద్రాలలో 215.5 మిల్లీమీటర్లు, నిర్మల్ జిల్లా అబ్దుల్లాపూర్‌లో 198.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

సిద్ధిపేట జిల్లా కోహెదలో                           223.5 మిల్లీమీటర్లు
సిద్దిపేట జిల్లా సముద్రాలలో                    215.5 మిల్లీమీటర్లు
నిర్మల్ జిల్లా అబ్దుల్లాపూర్                         198.8 మిల్లీమీటర్లు
సిద్దిపేట జిల్లా షానిగరమ్                          172 మిల్లీమీటర్లు
నిజామాబాద్ జిల్లా తొండకూర్                  162.3 మిల్లీమీటర్లు
నిజామాబాద్ జిల్లా మగిడిలో                      149.3 మిల్లీమీటర్లు
సిద్దిపేట జిల్లా నంగునూర్                         140.3 మిల్లీమీటర్లు
పెద్దపల్లి జిల్లా అకెన పల్లి                           127.5 మిల్లీమీటర్లు
నిజామాబాద్ జిల్లా మాచెర్ల                         125.8 మిల్లీమీటర్లు
నిజామాబాద్ జిల్లా ఆలూరు                        117 మిల్లీమీటర్లు

ఇవాళ ఏ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఇక తెలంగాణలోని అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ఇక అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, హైదరాబాద్, మేడ్చల్, యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక మహబూబ్ నగర్, నారాయణ పేట్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వార్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. 

Also read: Aadhaar PVC Card: ఆధార్ పీవీసీ కార్డు అంటే ఏమిటి, ఎలా అప్లే చేసుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News