Employees Salarys: రెండు వారాలైనా ఉద్యోగులకు నో జీతం.. బంగారు తెలంగాణలో కొత్త అప్పు పుడితేనే మోక్షం

Employees Salarys:తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉండగా సోమవారం వరకు 14 జిల్లాల ఉద్యోగులకు మాత్రమే వేతనాలు అందాయని తెలుస్తోంది. వాళ్ల కూడా ఓకే రోజున కాకుండా జిల్లాకో రోజు చెప్పున వేతనాలు జమ చేశారని తెలుస్తోంది. ప్రభుత్వం దగ్గర సరిపడా నిధులు లేకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందంటున్నారు.

Written by - Srisailam | Last Updated : Jul 12, 2022, 04:56 PM IST
  • 19 జిల్లాల ఉద్యోగులకు అందని జీతం
  • నిధులను సర్దుబాటు చేస్తూ చెల్లింపు
  • కొత్త అప్పు దొరికితేనే వేతనాలు
Employees Salarys: రెండు వారాలైనా ఉద్యోగులకు నో జీతం.. బంగారు తెలంగాణలో కొత్త అప్పు పుడితేనే మోక్షం

Employees Salarys: తెలంగాణ దేశంలోనే ధనిక రాష్ట్రం.. ఇది సీఎం కేసీఆర్ ఎప్పుడు చెప్పేమాట. బంగారు తెలంగాణ దేశానికే ఆదర్శమని కూడా ఆయన చెబుతూ ఉంటారు. అలాంటి బంగారు తెలంగాణలో ఉద్యోగులు, పెన్షనర్ల  పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. ఉద్యోగులు. పెన్షనర్లకు వేతనాలు ఎప్పుడైనా ఒకటో తారీఖునే వస్తాయి. పబ్లిక్ హాలీడే ఉంటే మాత్రం ఒకటి, రెండు రోజులు లేటవుతుంటాయి. కాని సీఎం కేసీఆర్ గొప్పగా చెబుతున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సీన్ మారిపోయింది. ఇప్పుడు ఉద్యోగులకు వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. జూన్ నెల వేతనం ఇంకా కొందరు ఉద్యోగులకు అందలేదు. జూలైలో రెండు వారాలు గడిచినా ఇంకా 19 జిల్లా ఉద్యోగులకు జీతాలు అందలేదని తెలుస్తోంది.

తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉండగా సోమవారం వరకు 14 జిల్లాల ఉద్యోగులకు మాత్రమే వేతనాలు అందాయని తెలుస్తోంది. వాళ్ల కూడా ఓకే రోజున కాకుండా జిల్లాకో రోజు చెప్పున వేతనాలు జమ చేశారని తెలుస్తోంది. ప్రభుత్వం దగ్గర సరిపడా నిధులు లేకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందంటున్నారు. ప్రభుత్వానికి నిధులు సర్దుబాటు అయ్యేకొలది ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తున్నారు. ప్రభుత్వానికి రోజువారీగా వచ్చే ఆదాయం నుంచే ఉద్యోగులకు విడతలవారీగా చెల్లింపులు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రతి నెలా కొత్తగా అప్పులు చేస్తూ ఉద్యోగులకు వేతనాలు ఇస్తోంది కేసీఆర్ సర్కార్. జూన్ నెలలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి జూన్‌ నెలలో రెండు విడతలుగా ఏడు వేల కోట్ల అప్పు తీసుకుంది. దీంతో జూలై నెలలో జీతాలు సకాలంలో వస్తాయని ఉద్యోగులు భావించారు. కానీ రెండు వారాలు గడుస్తున్నా 14 జిల్లాలు.. హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్లగొండ, మేడ్చల్‌, హన్మకొండ, జనగాం, భూపాలపల్లి, నారాయణపేట,  సిరిసిల్ల, వనపర్తి, ఆసిఫాబాద్‌, ఖమ్మం, వికారాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల ఉద్యోగులకే వేతనాలు అందాయి.

జూన్ నెలలో ఆర్బీఐ నుంచి 7000 వేల కోట్ల రుణం తీసుకోగా.. రెవెన్యూ ఆదాయం మరో 10 వేల కోట్లు వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. సర్కార్  ఖజానాలో 17 వేల కోట్ల రూపాయలు ఉండటంతో చాలా కాలం తర్వాత జూలైలో ఫస్ట్ తారీఖు వేతనం వస్తుందని ఉద్యోగులు ఆశించారు. అయితే జూన్‌ 28 నుంచి రైతుబంధు అందించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకు ఏడు వేల 6 వందల కోట్ల రూపాయలు అవరసమవుతాయి. ఖజానాలో ఉన్న 17 వేల కోట్లలో రైతు బంధు కోసం రూ. 7600 కోట్లు పక్కన పెట్టారు. మిగిలిన నిధులో అప్పులకు వడ్డీ కింద 1500 కోట్లు కట్టేశారు. ఉద్యోగుల వేతనాలు కోసం 4 వేల ఐదు వందల కోట్లు అవసరమవుతాయి. అత్యవసర పథకాలైన ఆసరా పెన్షన్లు, ఆరోగ్య శ్రీతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీంతో అత్యవసర పథకాలకు నిధులు సర్దుబాటు చేస్తూ.. ఉద్యోగులకు జిల్లాల వారీగా వేతనాలు జమ చేస్తున్నారని తెలుస్తోంది. ఉద్యోగుల నుంచి వ్యతిరేక రాకుండా ముందుగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఇచ్చారని భావిస్తున్నారు.

జూలై నెలలో వస్తున్న ఆదాయాన్ని కూడా ఉద్యోగుల వేతనాల కోసం వినియోగిస్తోంది. రోజువారీగా వస్తున్న ఆదాయాన్ని సర్దుబాటు చేస్తోంది. మంగళవారం  ఆర్‌బీఐ ద్వారా మ రో రూ.1000 కోట్ల అప్పు తీసుకుంది కేసీఆర్ సర్కార్. ఈ అప్పుతో మిగిలిన జిల్లాల ఉద్యోగులకు వేతనాలు జమ చేస్తుందని తెలుస్తోంది. దీంతో తమ అకౌంట్లలో డబ్బులు ఎప్పుడు పడతాయా అని ఎదురుచూస్తున్నారు 19 జిల్లాల ఉద్యోగులు.

Read also: Telangana EAMCET: తెలంగాణలో తగ్గని భారీ వర్షాలు.. ఎంసెట్ వాయిదా యోచనలో సర్కార్ 

Read also: Kalyan Dev: విడాకుల వార్తల నేపథ్యంలో కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్.. దాని గురించేనా?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News