100 Days Of Telangana Congress: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటితో వంద రోజులు..

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో (శుక్రవారం మార్చి 15) తో వందరోజులు పూర్తయ్యాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు జరిగేలా ప్రజాపాలన దిశగా అనేక పథకాలను ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు పేర్కొంది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణానికి భారీగా స్పందన వస్తున్న విషయం తెలిసిందే.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 15, 2024, 08:10 AM IST
  • తెలంగాణలో ప్రజాపాలన దిశగా కాంగ్రెస్ అడుగులు...
  • వందరోజుల్లోనే కాంగ్రెస్ ఐదు గ్యారంటీల అమలు..
100 Days Of Telangana Congress: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటితో వంద రోజులు..

CM Revanth Reddy 100 Days Of 6 Guarantees Plan: తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ తనదైన మార్కు చూపించే విధంగా పాలన అందిస్తుంది. ప్రజలకు ఆరు గ్యారంటీల పథకాలు అందివ్వడమే టార్గెట్ గా సీఎం రేవంత్ ప్రభుత్వం పనిచేస్తుంది. దీనిలో  భాగంగా.. ఇప్పటికే ఐదు హమీలను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మహిళలకు బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం, ఆరోగ్య శ్రీపరిమితిని రూ. 10 లక్షలకు పెంచడం వంటి నిర్ణయాలను అమలు చేసింది. దీనితో పాటు ఇప్పటికే అర్హులైన పేదలకు రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటివి పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీనితో పాటు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లనిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టినట్లు తెలంగాణ సర్కారు వందరోజుల తన పాలనపై  ప్రగతి నివేదిక లో వెల్లడించింది.

Read More: Viral News: ఇజ్జత్ తీశావ్ కదారా నాయన.. ప్లేట్ పావ్ భాజీ కోసం దేన్ని చోరీచేశాడో తెలిస్తే షాక్ అవుతారు..

అదే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం చేసిన అవినీతిని ప్రక్షాళన చేయడం ప్రారంభించింది. ప్రజల బాధలు వినాలనే ఉద్దేష్యంతో వారి నుంచి వినతులు స్వీకరించే కార్యక్రం ప్రారంభించింది. అనేక శాఖలను పూర్తిగా ప్రక్షాళన చేసి, విచారణ ప్రారంభించింది. టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసింది. స్టూడెంట్స్ కు ఇప్పటికే అనేక ఉద్యోగాల ఆఫర్ లెటర్ లు కూడా ఇచ్చింది. ఇటు గ్రూప్ 1 పోస్టుల సంఖ్యను పెంచడంతో పాటు, అన్నిరకాల ప్రభుత్వ ఎగ్జామ్ లలో తప్పిదాలు దొర్లకుండా  ఎగ్జామ్ ల నిర్వాహణలో కట్టుదిట్టుమైన చర్యలు తీసుకొవాలని కూడా టీఎస్పీఎస్సీ అధికారులను ఆదేశించింది.

ప్రజలకు పథకాలు అందేలా శ్రీకారం చుడుతూనే... అటు గత బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను ఏకీపారేస్తునే ఉంది. సాగునీరు, ప్రాజెక్టులు, ధరణి మొదలైన వాటిలో భారీగా అవినీతి జరిగిందని దీనిపై ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టింది. దీనిలో పలువులు ప్రభుత్వ అధికారులను పోలీసులు  అరెస్టు చేసి విచారణ సాగిస్తున్నారు. హైదరాబాద్ లో సెకంట్ ఫెజ్ మెట్రో పనులకు శ్రీకారం చుట్టింది.

Read More: BackPain: నడుము నొప్పితో బాధపడుతున్నారా..?.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..

రూ. 2700 కోట్లతో ప్రభుత్వ ఐటీఐల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మూసి నదీ ప్రక్షాళన, పరీవాహక ప్రాంతాల రీడీజైన్స్,  ప్రతిపాదనలను సిద్ధం చేస్తుంది. సింగరేణి ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద భీమా, హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాల స్థలం కేటాయించారు. అదే విధంగా ఒక్కొ నియోజక వర్గానికి 10 కోట్లు చొప్పున, నియోజక వర్గాల డెవలప్ మెంట్ కోసం రూ. 1,190 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.  నారాయణ పేట- కోడంగల్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన, మెడికల్, నర్సింగ్, ఫిజియో థెరపీ  కళాశాలకు భూమిపూజలు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News