Tapioca crops : కర్రపెండలం సాగుపై తెలంగాణ సర్కార్ ఫోకస్

కర్రపెండలం పంటకు జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందని, వర్షాధారంతో పాటు ఆరుతడి ద్వారా కర్రపెండలం సాగు చేయడంతో పాటు అధిక దిగుబడులు రాబట్టొచ్చునని మంత్రి తెలిపారు. కర్రపెండలం నుండి సాపుదనా (సగ్గుబియ్యం), గంజిపొడి, చిప్స్ తయారీ, లాంటి దాదాపు 18 రకాల వస్తువుల తయారీకి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వస్త్ర పరిశ్రమలోనూ కర్రపెండలం వినియోగిస్తుండటంతో ఈ పంటకు ప్రపంచవ్యాప్తంగా అధిక డిమాండ్ ఉంది.

Last Updated : Mar 3, 2020, 10:16 PM IST
Tapioca crops : కర్రపెండలం సాగుపై తెలంగాణ సర్కార్ ఫోకస్

హైదరాబాద్: పంటల మార్పిడికి రైతులను ప్రోత్సహించే క్రమంలో ఇప్పటికే ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం అందిస్తున్న తెలంగాణ సర్కార్ తాజాగా కర్రపెండలం సాగుపైనా దృష్టిసారించింది. తక్కువ తేమ, ఉష్ణోగ్రత గల తెలంగాణ నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉన్న గుర్తించినట్టు వ్యవసాయ శాఖ.. రైతులకు కర్ర పెండలం సాగుపై అవగాహన పెంచేందుకు కృషిచేస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు ఇతర వ్యవసాయ శాఖ నిపుణులతో కలిసి తాజాగా తమిళనాడులోని సేలం సమీపంలో ఏతాపూర్‌లో ఉన్న కర్రపెండలం, ఆముదం పరిశోధన, విత్తనోత్పత్తి క్షేత్రాలను సందర్శించారు. కర్రపెండలం పంటకు జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందని, వర్షాధారంతో పాటు ఆరుతడి ద్వారా కర్రపెండలం సాగు చేయడంతో పాటు అధిక దిగుబడులు రాబట్టొచ్చునని మంత్రి తెలిపారు. కర్రపెండలం నుండి సాపుదనా (సగ్గుబియ్యం), గంజిపొడి, చిప్స్ తయారీ, లాంటి దాదాపు 18 రకాల వస్తువుల తయారీకి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వస్త్ర పరిశ్రమలోనూ కర్రపెండలం వినియోగిస్తుండటంతో ఈ పంటకు ప్రపంచవ్యాప్తంగా అధిక డిమాండ్ ఉంది.

తెలంగాణలోనూ కర్రపెండలం సాగు:
ఏపీలో ఇప్పటికే 80 వేల ఎకరాలలో కర్రపెండలం సాగు చేస్తుండగా.. తెలంగాణలోనూ సాగునీటి వసతి పెరిగిన అనంతరం ఇప్పుడిప్పుడే కర్రపెండలం పంట సాగు పెరుగుతోంది. 7 నుండి 10 నెలల పాటు పండించే ఈ పంట వర్షాధారంతో ఎకరాకు 12 టన్నులు, ఆరుతడితో 15 టన్నుల వరకు దిగుబడి తీయోచ్చు. ప్రపంచంలో కర్రపెండలం పంటను అధికంగా సాగు చేసే దేశాల్లో దక్షిణాఫ్రికా ముందుంది.

సంప్రదాయ పంటల సాగుతో ఆదాయం కోల్పోతున్న రైతులకు వరం:
ఏళ్ల తరబడిగా సంప్రదాయ పంటల సాగుతో రైతులు ఆదాయం కోల్పోతుండటంతో పంట కాలనీలు, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందునుంచీ సూచిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే రైతాంగానికి కొత్త పంటలపై అవగాహన కల్పించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 

వెయ్యి ఎకరాల కర్రపెండలం సాగుతో పరిశ్రమ ఏర్పాటు:
వెయ్యి ఎకరాలలో కర్రపెండలం సాగు చేసినట్టయితే.. ఆ చుట్టుపక్కల పరిశ్రమ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆరుతడి పంటల కింద పాలమూరు జిల్లాలో ఆముదం విత్తనోత్పత్తి సాగుకు రైతులను ప్రోత్సహిస్తే అధిక లాభాలు కలిగే అవకాశాలున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో వర్షాధారంతో ఆముదం పంట సాగవుతోంది. వివిధ రకాల ఆయిల్, సబ్బులు, అయిట్‌మెంట్ల తయారీకి ఆముదం అవసరం పడుతుండటంతో ఆముదం పంటకు సైతం డిమాండ్ పెరుగుతోంది. త్వరలోనే కర్రపెండలం పంట సాగవుతున్న ప్రాంతాల్లోకి రైతులను క్షేత్రస్థాయి పర్యటనకు తీసుకెళ్లి వారికి అవగాహన కల్పించనున్నట్టు మంత్రి స్పష్టంచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News