Dr Jayaram murder case: ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎన్ఆర్ఐ, న్యూస్ ఛానెల్ అధినేత డాక్టర్ జయరాం హత్యకేసు మళ్లీ తెరపైకొచ్చింది. ఈ కేసులో పోలీసు అధికారుల పాత్రపై కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలుగు న్యూస్ ఛానెల్ ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత, ఎన్ఆర్ఐ డాక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు మరోసారి వార్తల్లోకెక్కింది. ఇప్పుడీ కేసులో పోలీసుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి బెయిల్ పిటీషన్‌పై విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు చేసి వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ కేసులో ఇతర నిందితుల్ని తక్షణం అరెస్టు చేయడమే కాకుండా పోలీసు అధికారుల పాత్రపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
2019 జనవరి 30వ తేదీన డాక్టర్ చిగురుపాటి జయరాంను హనీట్రాప్ ద్వారా..జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి రాకేశ్ రెడ్డి తన నివాసానికి రప్పించాడు. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి డాక్టర్ జయరాంను నిర్భంధించి హత్య చేశాడు. తరువాత జయరాం మృతదేహాన్ని కారులో ఉంచి..తన స్నేహితుడైన నల్లకుంట ఇన్స్పెక్టర్ శ్రీనివాసులును కలిసేందుకు ప్రయత్నించాడు. అతను అందుబాటులో లేకపోవడంతో..ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిని సంప్రదించాడు. ఈ ఇద్దరు పోలీసు అధికార్ల సూచనతో హత్యను డ్రంక్ అండ్ డ్రైవ్‌గా చిత్రీకరించేందుకు ప్లాన్ వేశారు. ఏపీలోని నందిగామకు తీసుకెళ్లి..కారుతో సహా మృతదేహాన్ని వదిలేసి తిరిగొచ్చేశాడు.
Also read: Vizag Shipyard jobs: విశాఖలో షిప్‌యార్డులో ఉద్యోగాలు..వెంటనే అప్లై చేయండి
డాక్టర్ జయరాం హత్యానంతరం ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుతో 13 సార్లు, ఏసీపీ మల్లారెడ్డితో 29 సార్లు మాట్లాడినట్టు రాకేశ్ రెడ్డి సెల్ రికార్డ్స్ చెబుతున్నాయి. రాయదుర్గం ఇన్స్పెక్టర్ రాంబాబుతో కూడా రాకేశ్ రెడ్డి మాట్లాడినట్టు సెల్ రికార్డులో ఉంది. నందిగామలో కేసు రిజిస్టర్ కాగా..తరువాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయింది. ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డిని ఫిబ్రవరి 7న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. రాకేశ్ రెడ్డితో పాటు మరో ఏడుగురు నిందితుల్ని జైలుకు పంపించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికార్లకు కేవలం నోటీసులు మాత్రమే పంపించారు.
విచిత్రమేమంటే..ఈ కేసులో పోలీసుల పాత్ర స్వల్పమని చెబుతూ..కేసును ముగించేందుకు ప్రయత్నించారు. సంచలనాత్మక కేసే కాకుండా..ఎన్ఆర్ఐ హత్య కేసైనా సరే పోలీసుల పాత్ర అనుమానాస్పదంగా మారింది. అందర్నీ అరెస్టు చేసి కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంది వాస్తవానికి. సుప్రీంకోర్టు ఇప్పుడీ విషయాన్నే ప్రశ్నించి..ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల పాత్రపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇప్పుడీ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. Also read: AP: CAG Report: చంద్రబాబు ప్రభుత్వం..ఇతర అవసరాలకే అప్పులు చేసింది