SC on MLC Kavitha Petition: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ విచారణ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు స్వల్ప ఊరట లభించింది. శుక్రవారం విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేయగా.. ఈ నోటీసులకు సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు కవిత. ఈ పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం విచారించగా.. ఇరు వైపుల వాదనలు వినిపించారు. కవిత తరఫున లాయర్లు వాదనలు వినిపిస్తూ.. ఈడీ కార్యాలయానికి మహిళలను విచారణ కోసం పిలిపించడాన్ని తప్పుపట్టారు. కవితకు ఇచ్చిన నోటీసులను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కేసు కోర్టులో నడుస్తున్న సమయంలోనే విచారణకు ఈడీ అధికారులు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. నళిని చిదంబరం కేసులో "బలవంతపు చర్యలు" తీసుకోవద్దని ఇచ్చిన సుప్రీం ఆదేశాలను కవిత కేసులో అమలు చేయాలని వాదించారు. సీఆర్పీసీ 160 వర్తించదని.. మహిళలను ఇంటి వద్ద విచారించాలన్నారు.
ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు పది రోజుల సమయం కోరారు. అప్పటి వరకు ఈడీ నోటీసులు వాయిదా వేస్తున్నామని చెప్పారు. అయితే విచారణకు మాత్రం హాజరుకావాలని స్పష్టం చేశారు. రెండు వర్గాల వాదనాలు విన్న ధర్మాసనం.. ఈడీ రిక్వెస్ట్ మేరకు విచారణను మరో పది రోజులు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 26న విచారణ చేపట్టనున్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పిన కవిత.. పార్టీ లీగల్ టీమ్‌తో చర్చించారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరైన కవిత.. మరోసారి నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణ చేపట్టిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. పది రోజులు విచారణను వాయిదా వేసింది.
మరోవైపు ఈ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా ఇన్నాళ్లు ప్రచారం జరిగింది. అయితే అరుణ్ పిళ్లై అనూహ్య ప్రకటన చేశారు. తాను అప్రూవర్‌గా మారినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. కేసు విచారణను ప్రభావితం చేసే విధంగా ఈ వార్తలు ఉన్నాయని అన్నారు. తన న్యాయవాదితో అరుణ్ రామచంద్ర పిళ్లై చెప్పించారు.
Also Read: Nipah Virus Cases: కేరళలో హై అలర్ట్.. 6కి చేరిన నిఫా వైరస్ కేసులు, ఇద్దరు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook