ఎంపీ కవిత ఛాలెంజ్‌ని స్వీకరించిన ఎస్ఎస్ రాజమౌళి

మంత్రి కేటీఆర్‌కు రాజమౌళి ఛాలెంజ్ 

Last Updated : Jul 24, 2018, 10:00 PM IST
ఎంపీ కవిత ఛాలెంజ్‌ని స్వీకరించిన ఎస్ఎస్ రాజమౌళి

టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత విసిరిన ఛాలెంజ్‌ని దర్శకుడు రాజమౌళి స్వీకరించారు. హరిత హారంలో భాగంగా రాష్ట్రంలో పిల్లలు, పెద్దలు అందరిచేత మొక్కలు నాటించి తెలంగాణ రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని తెలంగాణ సర్కార్ భావిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే హరిత హారం ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించిన రాజమౌళి.. తాను మూడు రకాల మొక్కలు నాటినట్టుగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అంతేకాకుండా తాను తన వంతుగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ, మహానటి ఫేమ్ నాగ అశ్విన్‌లను నామినేట్ చేస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ శివార్లలోని తన ఫామ్ హౌజ్‌లో రాజమౌళి ఈ మొక్కలు నాటారు.

 

Trending News