Minister Etela Dispute: మంత్రి ఈటెల రాజేందర్‌కు షాక్, వైద్య ఆరోగ్య శాఖ తొలగింపు

Minister Etela Dispute: తెలంగాణలో మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం వివాదం రేపుతోంది. ఈటెల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు సంచలనం కల్గిస్తున్నాయి. ఓ వైపు దర్యాప్తు జరుగుతుండగానే..ఈటెల నుంచి వైద్య ఆరోగ్య శాఖను తొలగించింది ప్రభుత్వం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 1, 2021, 03:00 PM IST
Minister Etela Dispute: మంత్రి ఈటెల రాజేందర్‌కు షాక్, వైద్య ఆరోగ్య శాఖ తొలగింపు

Minister Etela Dispute: తెలంగాణలో మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం వివాదం రేపుతోంది. ఈటెల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు సంచలనం కల్గిస్తున్నాయి. ఓ వైపు దర్యాప్తు జరుగుతుండగానే..ఈటెల నుంచి వైద్య ఆరోగ్య శాఖను తొలగించింది ప్రభుత్వం.

తెలంగాణ (Telangana)రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జా వ్యవహారం (Land Grabbing Dispute) తీవ్ర సంచలనంగా మారింది. మంత్రి ఈటెల తమ భూముల్ని కబ్జా చేశారని రైతులు ఆరోపించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR) తక్షణ విచారణకు ఆదేశించారు. ఈటెల రాజేందర్ రైతులకు చెందిన అసైన్డ్ భూముల్ని కబ్జా చేశారని ప్రాథమిక విచారణలో తేలిందని కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు. మరోవైపు ఈటెలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి రెవిన్యూ, విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఆ భూముల్లో మంత్రి రాజేందర్ పౌల్ట్రీ ఫామ్ కోసం రోడ్డు, హ్యాచరీ కోసం షెడ్‌లు నిర్మించారని కలెక్టర్ ధృవీకరించారు.

ఓ వైపు ఈటెల వ్యవహారంపై హైస్పీడ్ విచారణ సాగుతోంది. మరోవైపు ప్రభుత్వం కూడా చర్యలకు దిగింది. ఈటెల రాజేందర్ ( Etela Rajender) నుంచి వైద్య ఆరోగ్య శాఖ( Health Ministry)ను తొలగించింది. ఆ శాఖను తనకు బదిలీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్‌కు చేసిన సిఫారసును ఆమోదించారు. ఈటెల నుంచి సంబంధిత శాఖను తొలగించారు. ప్రస్తుతం ఈటెల ఏ శాఖలేని మంత్రిగా ఉండనున్నారు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణల్ని మంత్రి ఈటెల రాజేందర్ ఖండించారు. రాజకీయాల్లో అణచివేతలు సహజమని.. అసత్యాలతో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరారు.

Also read: Eatala Rajender: భూ కబ్జా ఆరోపణలను తిప్పికొడుతూ వారిపై కన్నెర్ర చేసిన మంత్రి ఈటల రాజేందర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News