Assam CM Himanta Biswa Sarma: హైదరాబాద్‌లో అసోం సీఎంకి అవమానం, భద్రతలో లోపం

Assam CM Himanta Biswa Sarma: అసోం సీఎం హిమంత బిశ్వశర్మను మాట్లాడనీయకుండా టీఆర్ఎస్ నేతలు మైక్ లాక్కోవడం హేయమైన చర్య అని కరీంనగర్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 9, 2022, 09:28 PM IST
  • కేసీఆర్‌కు కేంద్రం భద్రత కల్పించకపోతే పరిస్థితేంటన్న బండి సంజయ్
  • ఆ టీఆర్ఎస్ నేతపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్
  • కేసీఆర్ హిందువుల పండుగలకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని ఆరోపణలు
Assam CM Himanta Biswa Sarma: హైదరాబాద్‌లో అసోం సీఎంకి అవమానం, భద్రతలో లోపం

Assam CM Himanta Biswa Sarma: అసోం సీఎం హిమంత బిశ్వశర్మను మాట్లాడనీయకుండా టీఆర్ఎస్ నేతలు మైక్ లాక్కోవడం హేయమైన చర్య అని కరీంనగర్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హిందువుల సంఘటిత శక్తిని చాటుతూ భారత దేశంలోనే అత్యద్భుతమైన శోభాయాత్రగా సాగే గణేష్ నిమజ్జన ఉత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన అసోం ముఖ్యమంత్రిని గౌరవించాలనే కనీస సోయి కూడా లేకుండా టీఆర్ఎస్ నేతలు నీచంగా వ్యవహరించడం సిగ్గు చేటు అని బండి సంజయ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేజీపై ఉన్న సమయంలోనే ప్రోటోకాల్ నిబంధనలు పాటించకుండా మెడలో టీఆర్ఎస్ కండువా వేసుకున్న టీఆర్ఎస్ నాయకులను పోలీసులు స్టేజీపైకి ఎట్టా రానిచ్చారని ప్రశ్నించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ పోలీసులు ఇచ్చే భద్రత ఇదేనా అని బండి సంజయ్ మండిపడ్డారు. 

కేసీఆర్‌కు కేంద్రం భద్రత కల్పించకపోతే పరిస్థితేంటి ?
ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళుతున్న సీఎం కేసీఆర్‌కు కేంద్రం భద్రత కల్పించకపోతే స్వేచ్ఛగా వెళ్లగలిగేవారా ? బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశాంతంగా తిరగగలరా అని టీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ సవాల్ విసిరారు. గణేష్ నిమజ్జన శోభా యాత్రలో కేసీఆర్ కానీ, ఆయన కుటుంబ సభ్యులుగానీ ఎక్కడా పాల్గొనకపోగా.. లక్షలాది మంది పాల్గొనే శోభాయాత్రలో పాల్గొనేందుకు అసోం నుండి వచ్చిన ముఖ్య అతిథిని అడ్డుకుంటే పరువు పోతుందనే కనీస ఆలోచన కూడా లేకపోవడం సిగ్గు చేటు అన్నారు.

ఆ టీఆర్ఎస్ నేతపై హత్యాయత్నం కేసు పెట్టాలి..
భారత దేశంలోనే అతి తక్కువ కాలంలో అద్భుతమైన పాలనతో అసోంను అభివృద్ధి చేసి చూపిస్తున్న గొప్ప వ్యక్తి హేమంత బిశ్వ శర్మ. అవినీతి రహిత పాలనతో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న నాయకుడు. ఆయన నుండి నేర్చుకోవాల్సింది పోయి టీఆర్ఎస్ గూండాలను పంపించి దాడి చేయించే కుట్ర చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనంగా చెప్పుకొచ్చారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ నేతపై తక్షణమే అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు పెట్టాలి. ఈ దాడికి పురిగొల్పిన రాష్ట్ర మంత్రులపైనా కేసు నమోదు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

హిందువుల పండుగలకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్న సీఎం కేసీఆర్
గణేష్ నిమజ్జనాన్ని అడ్డుకునేందుకు ఆంక్షల పేరుతో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ హిందువుల పండుగలకు ప్రాధాన్యత లేకుండా చేయాలన్న సీఎం కేసీఆర్ చేసిన కుట్రలను హిందువులంతా తిప్పికొట్టారు. లక్షలాదిగా శోభాయాత్రలో పాల్గొని కేసీఆర్ చెంప చెళ్లుమన్పించేలా హిందువుల సంఘటిత శక్తిని మరోసారి చాటిచెప్పారు.   

కమ్మ సంఘం భవనంలోనే పెద్ద మనిషిపై దాడి దారుణం..
ఇతర రాష్ట్రాల నాయకులను, ముఖ్యమంత్రులను గౌరవించాలనే కనీస సోయిలేని కేసీఆర్ జాతీయ పార్టీ పెడతానని చెప్పడం హాస్యాస్పదం. కమ్మ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నేత ఎర్నేని రామారావుపైనా టీఆర్ఎస్ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. 70 ఏళ్ల పైబడ్డ పెద్ద మనిషిపై కమ్మ సంఘం భనవంలోనే మూకుమ్మడిగా టీఆర్ఎస్ గూండాలు దాడి చేయడం అత్యంత దారుణం. స్థానిక మంత్రి ప్యానెల్‌ను ఎర్నేని రామారావు ఓడించడాన్ని జీర్ణించుకోలేకే స్థానిక మంత్రి అనుచరులమని చెప్పుకుంటూ దాడి చేయడం సిగ్గు చేటు. బీజేపీ నేతలను చూస్తేనే టీఆర్ఎస్ నేతలకు వణుకు పుడుతోంది. ప్రజా స్వామ్యయుతంగా ఎదుర్కోలేక ఇట్లాంటి దాడులు చేయడం హేయమైన చర్య. ఎర్నేని రామారావుకు, ఆయన కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుంది. దాడులకు పాల్పడ్డ వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. దాడికి పురిగొల్పిన నాయకులపై కేసు నమోదు చేయాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Also Read : Munugode By Election : మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి...

Also Read : Revanth Reddy: తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News