Secunderabad-Tirupati Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ, ఏపీ మధ్య రెండో వందేభారత్ రైలును పట్టాలెక్కించనుంది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఈ ట్రైన్ ను నడపనున్నారు. ఈనెల 08న రైలును ప్రధాని మోదీ సికింద్రాబాద్ నుంచి ప్రారంభించినున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ట్రైన్ సికింద్రాబాద్‌లో ఉదయం 11.30 గంటలకు ప్రారంభమై తిరుపతి రాత్రి 9 గంటలకు చేరుతుంది.
సికింద్రాబాద్-తిరుపతి మధ్యన నడిచే ఈ ట్రైన్ గమ్యస్థానాన్ని చేరుకోవటానికి 8.30 గంటల సమయం పడుతుంది. ఈ వందేభారత్ ట్రైన్ నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది. ప్రారంభోత్సవం రోజున నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో వందేభారత్ రైలు ఆగతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ ట్రైన్ ఆగే ప్రదేశాల్లోని ప్రజలు ఘన స్వాగతం పలకాలని కిషన్ రెడ్డి కోరారు. హైదరాబాద్ నుంచి రోజూ అధిక సంఖ్యలో ప్రజలు తిరుపతికి వెళ్తూంటారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాల మధ్య రైలు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందేభారత్ రైలును ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కానుకగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ రైలు విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడుస్తోంది.
Also Read: Covid19 Cases in India: కలవరం కల్గిస్తున్న కోవిడ్19, గత 24 గంటల్లో 3 వేల కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి