VLF Radar Station: పర్యావరణం గురించి ఆలోచించే వారు దేశ రక్షణ విషయం కూడా ఆలోచించాలని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. వివాదాలకు తెరలేపుతున్నవారు దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలని చెప్పారు. దేశం, దేశ ప్రజలు సురక్షితంగా ఉంటేనే పర్యావరణ రక్షణ గురించి ఆలోచించగలమని పేర్కొన్నారు. దేశ రక్షణలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాడార్ కేంద్రం ఇక్కడకు రావడం గర్వకారణంగా తెలిపారు.
Also Read: AP Cadre IAS: ఆంధ్రప్రదేశ్‌కు మేం వెళ్లలేం.. మళ్లీ కోర్టును ఆశ్రయించిన ఐఏఎస్‌లు
పచ్చటి అడవుల మధ్య రాడార్ కేంద్రం ఏర్పాటు తీవ్ర వివాదం కొనసాగుతున్న సమయంలోనే మంగళవారం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా రాడార్ కేంద్రం ఏర్పాటు వివాదంపై స్పందించారు. 'దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతోంది. దేశ రక్షణకు సంబంధించి కీలకమైన డిఫెన్స్,ఎన్.ఎఫ్.సీ లాంటి కేంద్రాలకు హైదరాబాద్ గుర్తింపు పొందింది. కొందరు వీఎల్ఎఫ్ ను వివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీఎల్ఎఫ్‌తో ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు' అని మండిపడ్డారు.
Also Read: KT Rama Rao: దసరా రోజు ఆ ఇద్దరి మరణానికి రేవంత్ రెడ్డిదే బాధ్యత
'తమిళనాడులోనూ 1990లో ఇలాంటిదే ప్రారంభించారు. కానీ అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదు. దేశంలో రెండో వీఎల్ఎఫ్ మన ప్రాంతంలో రావడం గర్వకారణం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలని చెప్పారు. 'వివాదాలకు తెరలేపుతున్నవారు దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి. దేశం ఉంటేనే మనం ఉంటాం.. మనం ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది' అని పేర్కొన్నారు.
'దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసే ప్రాజెక్టులను కూడా రాజకీయాల మోసం వివాదం చేసేవారికి కనువిప్పు కలగాలి. 2017లోనే భూ బదలాయింపు, నిధుల కేటాయింపు వంటివి కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి' అని తెలంగాణ సీఎం గుర్తుచేశారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడొద్దనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. 'పర్యావరణ ప్రేమికులకు నేను ఒకటే చెబుతున్నా. దేశం, దేశ ప్రజలు సురక్షితంగా ఉంటేనే పర్యావరణ రక్షణ గురించి ఆలోచించగలం. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్ట్ ను వివాదాస్పదం చేయడం సమంజసం కాదు' అని చెప్పారు. 'ఎన్నికల సమయంలో పార్టీలు, రాజకీయాలు. దేశ రక్షణ విషయంలో కలిసికట్టుగా ముందుకెళ్లాలి' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి