Revanth Reddy: కేసీఆర్, మోదీలను రైతులు బండకేసి కొట్టాలి... రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy : టీఆర్ఎస్,బీజేపీ కుమ్మక్కై దళారులు, మిల్లర్లకు మేలు చేసేలా కమిషన్ల కోసం రైతుల పొట్ట కొడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద తక్షణమే రూ.10వేల కోట్లు విడుదల చేసి పండించిన ప్రతీ గింజ కొనుగోలు చేయాలని  డిమాండ్ చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2021, 03:14 PM IST
  • రైతులు పండించిన ప్రతీ గింజ ప్రభుత్వం కొనాల్సిందేనన్న రేవంత్
    టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై నాటకాలాడుతున్నారంటూ విమర్శలు
    కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్
Revanth Reddy: కేసీఆర్, మోదీలను రైతులు బండకేసి కొట్టాలి... రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy : వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లను (KCR) రైతులు బండకేసి కొట్టాలని అన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ ప్రధానమంత్రి ఇద్దరూ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు (Paddy Purchase) చేయమని చెబుతున్నప్పుడు... రైతులు (Farmers) వారికెందుకు ఓటు వేయాలన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజ కొంటామని చెప్పిన కేసీఆర్... ఇప్పుడు ఒక్క గింజ కూడా కొనమని చెప్పడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్‌కు మతి చలించి మాట్లాడుతున్నారా లేక మత్తులో ఉండి మాట్లాడుతున్నారా అంటూ ఎద్దేవా చేశారు.

టీఆర్ఎస్,బీజేపీ (BJP) కుమ్మక్కై దళారులు, మిల్లర్లకు మేలు చేసేలా కమిషన్ల కోసం రైతుల పొట్ట కొడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద తక్షణమే రూ.10వేల కోట్లు విడుదల చేసి పండించిన ప్రతీ గింజ కొనుగోలు చేయాలని 
డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో పంట దిగుబడి ఎక్కువగా జరిగినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వమే ప్రతీ గింజ కొనుగోలు చేసిందన్నారు.

Also Read:Sonu Sood Sister Moga: సోనూసూద్ కీలక ప్రకటన.. పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయనున్న సోనూ సోదరి

రైతుల విషయంలో కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఇందిరా పార్క్‌ వద్ద ధర్నాలో ఆయన కూడా పాల్గొని ఉండేవాడన్నారు. తెలంగాణ రైతుల (Telangana Farmers) జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతుంటే... రైతుల ప్రాణాలు పోతుంటే ఫాంహౌస్‌లో విందు, వినోదాలతో గడుపుతున్నాడని విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న వీధి నాటకాలు వరి కుప్పలపై పడుకుంటున్న రైతులకు ఇప్పటికే అర్థమైపోయాయని అన్నారు.

Also Read: Pradhan Mantri Awaas Yojana: రూ. 700 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన మోదీ

రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయమంటే కుదరదని.. ఎట్లా కొనరో చూస్తామని హెచ్చరించారు. రైతుల కోసం కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ (Bandi Sanjay) ఒక అవగాహనతో, సమన్వయంతో నాటకమాడుతున్నారని విమర్శించారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు తప్పితే... ఎవరూ పరిష్కారం చూపించట్లేదన్నారు. దీన్నిబట్టి ఇద్దరూ ఒక అవగాహనతో ఈ నాటకం ఆడుతున్నట్లు అర్థమవుతోందన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News