Revanth Vs Owaisi: ఒవైసీ కాలేజీలు నేలమట్టం? హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఇదే..!

Revanth Vs Owaisi: రేవంత్ రెడ్డి నెక్ట్స్ టార్గెట్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ని టార్గెట్ చేసాడా.. ? అంతేకాదు ఆయనకు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యాడా అంటే ఔననే సమాధానం వస్తోంది. అంతేకాదు హైడ్రాతో చెరువులు, కుంటల్లో అక్రమంగా  నిర్మించిన ఒవైసీ నిర్మించిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 26, 2024, 01:05 PM IST
 Revanth Vs Owaisi: ఒవైసీ కాలేజీలు నేలమట్టం? హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఇదే..!

Revanth Vs Owaisi: రేవంత్ రెడ్డి దూకుడు మీదున్నాడు. తన ప్రభుత్వ తప్పిదాల నుంచి దృష్టి మరల్చడానికే రేవంత్ రెడ్డి హైడ్రాతో అక్రమంగా కట్టిన నిర్మాణాలపై చర్యలు ఉపక్రమించినట్టు తెలుస్తోంది. అంతేకాదు నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో అక్రమ నిర్మాణాలు చేపట్టినవాళ్లు ఎవరైనా ఒదిలే ప్రసక్తే లేదంటున్నారు. ముఖ్యంగా తన పార్టీకి సంబంధించిన వారు ఎవరున్నా ఒదిలేది లేదంటూ శపథం చేసారు. చెరువులు, కుంటల్లో కట్టిన అక్రమ నిర్మాణాలు మన నగరంలో ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ రేవంత్ సర్కార్ చిత్తశుద్దితో తొలిగిస్తుందా లేదా అనేది పక్కన పెడితే.. ప్రస్తుతానికి మాత్రం అక్రమ కట్టడాలు అని లెక్క తేలితే అసలు ఒదిలిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చిరకాల మిత్రుడైన ఎంఐఎం పార్టీ అధినేత అక్రమ కట్టడాలను కూల్చడానికి కూడా హైడ్రా వెనకాడటం లేదు.  

తెలంగాణ ఎన్నికల ముందు వరకు కేసీఆర్ కు చెందిన బీఆర్ఎస్ తో  చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఒవైసీ బ్రదర్స్.. 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల తర్వాత తిరిగి కాంగ్రెస్ పంచన చేరారు. అప్పట్లో ఎంఐఎం పార్టీ.. బీఆర్ఎస్, బీజేపీ బీ టీమ్ అంటూ విమర్శించిన రేవంత్ రెడ్డి.. ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ.. ఎంఐఎం పార్టీలు తిరిగి ఒకటయ్యాయి. అంతేకాదు 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పి ఆ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచేలా చేయడంలో ఓవైసీ పాత్ర ఉంది.

అక్రమ కట్టడాలు కూల్చేస్తున్న హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఓవైసీ బ్రదర్స్ అనే చర్చ జోరుగా సాగుతోంది. ఒవైసీ బ్రదర్స్ కు సంబంధించిన అక్రమ కట్టడాలపై హైడ్రా కు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఎక్స్ మాధ్యమం ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి పిర్యాదు చేశారు పాతబస్తీ వాసులు.

బండ్లగుడా సలకం చెరువులో ఓవైసీ బ్రదర్స్ అక్రమంగా విద్యాసంస్థలు నిర్మించారని ఫిర్యాదు చేశారు. చెరువు సగం ఆక్రమించి ఫాతిమా విద్యా సంస్థలను నిర్మించారని అసద్ పై ఆరోపణలు ఉన్నాయి. చెరువులోనే బిల్డింగులు కనిపిస్తున్నా ఎందుకు కూల్చడం లేదని ఎక్స్ లో సీఎం రేవంత్ ను ప్రశ్నిస్తున్నారు ఓల్డ్ సిటీకి చెందిన జనాలు. హైడ్రాకు భారీగా ఫిర్యాదులు వస్తుండటంతో సలకం చెరువులో కట్టిన నిర్మాణాలను కూల్చేస్తారనే ప్రచారం సాగుతోంది. తమ భవనాలను కూల్చివేస్తారనే భయంతోనే  హైడ్రాకు వ్యతిరేకంగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నడుం బిగించారు. .

అంతేకాదు హైడ్రా కూల్చివేతలపై స్పందించారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్‌టీఎల్‌ (ఫుల్ ట్యాంక్ లెవల్ )లో కట్టారు.. అలాంటి స్థలంలో కట్టిన ప్రభుత్వ భవనాలను కూడా కూల్చేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఒవైసీ.
నెక్లెస్‌రోడ్‌ కూడా ఫుల్ ట్యాంక్  లెవల్ పరిధిలో   ఉందన్నారు బిగ్ ఒవైసీ. అలాంటపుడు నెక్లెస్‌రోడ్‌ను కూడా తొలగిస్తారా  అని నిలదీశారు . జీహెచ్‌ఎంసీ కార్యాలయం దగ్గర నీటికుంట ఉండేదని చెప్పుకొచ్చారు.  మరి జీహెచ్‌ఎంసీ కార్యాలయం పరిస్థితేంటి అని  అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి రేవంత్ సర్కార్ దగ్గర వీటికి సమాధానాలు ఉన్నాయా అనేది చూడాలి.

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News