Revanth Reddy: మునుగోడులో రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్.. టీఆర్ఎస్, బీజేపీ షేక్!

Revanth Reddy: తాను పీసీసీ చీఫ్ అయ్యాకే జరిగిన హుజురుబాద్ ఉప ఎన్నికను పెద్దగా పట్టించుకోని రేవంత్ రెడ్డి.. మునుగోడుపై మాత్రం దూకుడుగా వెళుతున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటన చేసిన మూడు రోజుల్లోనే మునుగోడుకు వెళ్లి బహిరంగ సభ నిర్వహించారు. మునుగోడు గడ్డ నుంచే గర్జించారు

Written by - Srisailam | Last Updated : Aug 6, 2022, 08:55 AM IST
Revanth Reddy: మునుగోడులో రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్.. టీఆర్ఎస్, బీజేపీ షేక్!

Revanth Reddy: తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతోంది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. రాజీనామా లేఖ ఇచ్చేందుకు స్పీకర్ అపాయింట్ మెంట్ అడిగారు. ఈనెల 8వ తేదిన స్పీకర్ అందుబాటులో ఉండటంతో..ఆ రోజునే స్పీకర్ ను కలిసి తన రాజీనామా లేఖ సమర్పించనున్నారు రాజగోపాల్ రెడ్డి. దీంతో మునుగోడుకు నవంబర్ లేదా డిసెంబర్ లో ఉప ఎన్నిక రావొచ్చని అంచనా వేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటనతోనే తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. అన్ని పార్టీల నేతలు మునుగోడుకు క్యూకడుతున్నారు. సర్వేలు చేయిస్తూ తమ పరిస్థితిని అంచనా వేయడంతో పాటు బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తున్నాయి.

కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కావడంతో మునుగోడును ఉప ఎన్నికల సవాల్ గా తీసుకుంటోంది కాంగ్రెస్. తాను పీసీసీ చీఫ్ అయ్యాకే జరిగిన హుజురుబాద్ ఉప ఎన్నికను పెద్దగా పట్టించుకోని రేవంత్ రెడ్డి.. మునుగోడుపై మాత్రం దూకుడుగా వెళుతున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటన చేసిన మూడు రోజుల్లోనే మునుగోడుకు వెళ్లి బహిరంగ సభ నిర్వహించారు. మునుగోడు గడ్డ నుంచే గర్జించారు. రాజగోపాల్ రెడ్డిని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి ఊరుకి వెళ్లి ప్రచారం చేస్తానని ప్రకటించారు రేవంత్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నిక విషయంలో రేవంత్ రెడ్డి దూకుడు కాంగ్రెస్ కేడర్ లో జోష్ నింపుతోంది. ఇక మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి విషయంలో రేవంత్ రెడ్డి క్లారిటీగా ఉన్నారని అంటున్నారు. ఆయన వ్యూహంతో అధికార టీఆర్ఎస్, బీజేపీలో ఆందోళన నెలకొందనే టాక్ వస్తోంది.

మునుగోడు నియోజకవర్గంలో బీసీ ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ బీసీ ఓటర్లు 50 శాతానికి పైగానే ఉంటారు. కాని మునుగోడులో మాత్రం 70 శాతానికి పైగా ఉన్నారని లెక్కలు చెబుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 27 వేల ఓట్లు ఉన్నాయి. సామాజిక వర్గాల వారీగా చూస్తే గౌడ్ లు 35 వేల మంది ఓటర్లు ఉండగా.. పద్మశాలీలు 32 వేల వరకు ఉన్నారు. ముదిరాజ్ లు 31 వేల మంది, యాదవ సామాజిక వర్గం నుంచి దాదాపు 26 వేల మంది ఓటర్లు మునుగోడు నియోజకవర్గంలో ఉన్నారు. మొత్తంగా దాదాపు లక్షా 50 వేల మంది బీసీ ఓటర్లే ఉన్నారు. ఎస్సీలు కూడా ఎక్కువే. మాదిగలు 25 వేల వరకు ఉండగా..మాలలు 11 వేల ఓటర్లు ఉన్నారు. ఎస్టీలు 11 వేల వరకు ఉన్నారు. మైనార్టీల వర్గానికి చెందిన 6 వేల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా మునుగోడు నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాల వారే 90 శాతానికి పైగా ఉన్నారు. ఓసీల్లో రెడ్డి ఓటర్లు 7 వేల 6  వందలు కాగా.. కమ్మలు దాదాపు 5 వేలు ఉన్నారు. వెలమ ఓటర్లు రెండున్నర వేలు ఉండగా.. ఆర్యవైశ్య, బ్రహ్మణ సామాజికవర్గాల నుంచి మరో 4 వేల మంది ఓటర్లు ఉన్నారు.

బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో రేవంత్ రెడ్డి ఖతర్నాక్ స్కెచ్ వేశారని అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న చెరుకు సుధాకర్ ను తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చెరుకుపై ఏకంగా పీడీ చట్టం కింద కేసు పెట్టడంతో ఆరు నెలల పాటు జైలులో ఉన్నారు. ఉద్యమకారుడిగా గుర్తింపు ఉన్న చెరుకు సుధాకర్ ను మునుగోడు బరిలో దింపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ మునుగోడు సభ రోజే చెరుకు సుధాకర్ ఢిల్లీలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. చెరుకు సుధాకర్ గౌడ్. మునుగోడులో గౌడ్ ఓటర్లు దాదాపు 35 వేలు. సుధాకర్ భార్య ఎస్సీ మాదిగ. గతంలో ఆమె నకిరేకల్ ఎస్సీ రిజర్వ్ సీటు నుంచి పోటీ చేశారు. మునుగోడులో ఎస్సీ ఓటర్లు 36 వేలు. చెరుకు సధాకర్ పోటీలో ఉండే  ఈ రెండు సామాజిక వర్గాల మద్దతు లభిస్తుందని రేవంత్ రెడ్డి లెక్కలు వేశారని అంటున్నారు. లెఫ్టిస్ట్ భావజలం కలిగిన చెరుకుకు వామపక్ష పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మునుగోడు నియోజకవర్గంలో సీపీఐ, సీపీఎంకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. అందుకే చండూరు సభలో పదేపదే రేవంత్ రెడ్డి కమ్యూనిస్టులను పొగుడుతూ మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టు పార్టీల మద్దతు కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. చెరుకుకు టికెట్ ఇస్తే వామపక్షాల మద్దతు కాంగ్రెస్ దక్కే అవకాశం ఉంది. అధికారికంగా మద్దతు ఇవ్వకపోయినా చెరుకుకు కమ్యూనిస్టులు ఓట్లు పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చెరుకు సుధాకర్ ని తెరపైకి తీసుకురావడం ద్వారా బలమైన అభ్యర్థిని బరిలో దింపడంతో పాటు తనకు కొరకరాని కొయ్యగా మారిన కోమటిరెడ్డి బ్రదర్స్ కు పూర్తి స్థాయిలో చెక్ పెట్టేలా రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారని అంటున్నారు. చెరుకు సుధాకర్ మొదటి నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ కు వ్యతిరేకంగా పని చేశారు. అందుకే చెరుకు సుధాకర్ చేరికను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పుపట్టారు. అయినా చెరుకును పార్టీలో తీసుకురావడం ద్వారా వెంకట్ రెడ్డికి షాకిచ్చారు రేవంత్ రెడ్డి. మునుగోడు టికెట్ కూడా ఇచ్చి కోమటిరెడ్డికి మరింత రేవంత్ రెడ్డి మరింత ఝలక్ ఇవ్వబోతున్నారనే ప్రచారం సాగుతోంది.

Read also: Telangana Rain Alert:13 జిల్లాలకు రెడ్ అలర్ట్.. తెలంగాణలో మళ్లీ వరద గండం

Read also: ED on Casino: క్యాసినో వ్యవహారంలో ఎమ్మెల్యేలకు నోటీసులు..ఆ నలుగురు ఎవరంటే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News