Heavy Rains in Telangana: తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్రవాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. సోమవారం నైరుతి ఆవర్తనం, దాని పరిసరాల్లోని ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించింది.
ఇవాళ (మంగళవారం) హైదరాబాద్ జిల్లా, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూలు, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సూర్యాపేట, సంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇక రేపు (బుధవారం) రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో, గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అక్కడకక్కడ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.
Also Read: PM Modi to Visit Warangal: ఈ నెల 8న వరంగల్‌కు ప్రధాని మోదీ.. భారీగా అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం
మరోవైపు తెలంగాణలోని 9 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని సర్కారుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చింది. జూన్ నెలలో సగటు వర్షపాతంతో పోల్చితే 60 శాతం నుంచి 77 శాతం తక్కువగా(కొరత)వరంగల్, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో పడిందని తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK