Telangana: తెలంగాణపై రాహుల్ కు సునీల్ టీమ్ రిపోర్ట్.. ఇవాళ పీసీసీ నేతలతో మీటింగ్

వర్గ పోరుతో రోడ్డున పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ ను గాడిలో పెట్టేందుకు సోమవారం సాయంత్రం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2022, 11:21 AM IST
  • సోమవారం సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్న రాహుల్ గాంధీ
  • పార్టీ బలోపేతం, ప్రజా ఉద్యమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న రాహుల్ గాంధీ
  • రాహుల్ సమావేశానికి హాజరవుబోతున్న రాజకీయ వ్యూహకర్త సునీల్
Telangana: తెలంగాణపై రాహుల్ కు సునీల్ టీమ్ రిపోర్ట్.. ఇవాళ పీసీసీ నేతలతో మీటింగ్

Telangana: వర్గ పోరుతో రోడ్డున పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ ను గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తోంది హైకమాండ్. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేలా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ లో అన్ని గ్రూపులను రాహుల్ తో సమావేశానికి అధిష్టానం పిలిచింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు కొంత కాలంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ హనుమంతరావుతు హైకమాండ్ ఆహ్వానించింది. రాహుల్ సమావేశం కోసం కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లారు జగ్గారెడ్డి. 

తెలంగాణలో పార్టీ బలోపేతం, ప్రజా ఉద్యమాలపై పార్టీ శ్రేణులకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాటాలు చేయాల్సిన పరిస్థితులపై కూడా రాహుల్ గాంధీతో భేటీలో చర్చించనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పై కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన ఉద్యమాలకు కూడా కార్యాచరణ రూపొందించనున్నారని సమాచారం. కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను ఢిల్లీలోని ఆ పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదనే వాదన వినిపించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చించేందుకు ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఈ భేటీలో పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలకు సంబంధించిన అంశాలపైనా ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే రాహుల్ తెలంగాణ టూర్ షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశం ఉందని టీకాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

రాహుల్ సమావేశానికి రాజకీయ వ్యూహకర్త సునీల్ హాజరవుతారని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నియోజకవర్గాలలో సునీల్ టీమ్ సర్వే చేసింది. ఆ క్షేత్రస్థాయి నివేదికలతో సునీల్ ఈ సమావేశానికి హాజరుకానున్నారని చెబుతున్నారు. సునీల్ ఇచ్చే రిపోర్ట్ ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణపై కూడా నిర్ణయం తీసుకుంటారని సమాచారం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మద్దతుగా సునీల్ మరియు పార్టీ నేతలంతా పూర్తిగా సహకారం అందించాలని, రాజకీయ వ్యూహకర్త సునీల్ సూచించిన వ్యూహం ప్రకారం ఎన్నికల ప్రచారంలోకి దిగాలని రాహుల్ గాంధీ సూచించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

Also Read: HDFC Merger News: హెచ్‌డీఎఫ్‌సీ సంస్థల కీలక నిర్ణయం.. భారీగా పెరిగిన షేర్ వాల్యూ!

Also Read: China Corona Cases: చైనాలో భారీగా పెరిగిన కొవిడ్ వ్యాప్తి.. ఒక్కరోజే 13 వేల కేసులు నమోదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News