Tukkuguda Meeting: తుక్కుగూడ సభలో భట్టి విక్రమార్కకు అవమానం.. ఓవరాక్షన్ చేసిన సీపీ తరుణ్ జోషి..

Tukkuguda Meeting: తుక్కుగూడ జనజాతర సభలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ డిప్యూటీ సీఎం వాహనం అని చెప్పిన కూడా స్టేజీ దగ్గరకు అనుమతించలేదు. అంతటితో ఆగకుండా, వెహికిల్ డ్రైవర్ శ్రీనివాస్ పై దాడికి కూడా పాల్పడినట్లు తెలుస్తోంది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 7, 2024, 12:58 PM IST
  • తుక్కుగూడ సభలో పోలీసుల అత్యుత్సాహం..
  • భట్టీ విక్రమార్క వెహికిల్ డ్రైవర్ పై దాడి..
Tukkuguda Meeting: తుక్కుగూడ సభలో భట్టి విక్రమార్కకు అవమానం.. ఓవరాక్షన్ చేసిన సీపీ తరుణ్ జోషి..

Rachokonda CP Tarun Joshi Over Actoion In Tukkuguda Meeting:  కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభలో రాచకొండ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం వాహనమని చెప్పిన కూడా, స్టేజీ దగ్గరకు వెళ్లేందుకు అక్కడ విధుల్లో ఉన్న తరుణ్ జోషి అనుమతించలేదు. అంతటితో ఆగకుండా.. డ్రైవర్ శ్రీనివాస్ పై చేయిచేసుకున్నట్లు సమాచారం. ఈ వాహానం డిప్యూటీ సీఎం భట్టీది అని చెప్పిన, తన దగ్గర డయాస్ పాస్ ఉందని చెప్పినకూడా సీపీ లెక్కచేయలేదు. అరగంట పాటు డ్రైవర్ శ్రీనివాస్ ను బయటివైపు వేచిఉండేలా చేశారు. అంతటితో ఆగకుండా అరంట తర్వాత అక్కడ విధుల్లో ఉన్న మరో ఏసీపీతో కూడా కొట్టించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను వీడియో తీస్తున్న ఒక ఫోటోగ్రాఫర్ పైన కూడా పోలీసులు దాడికి పాల్పడినట్లు సమాచారం.

 

ప్రస్తుతం ఈ ఘటనపట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బందోబస్తు నిర్వహించాల్సిన పోలీసులు.. ఇలా అమాయకులపై దాడులు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కూడా కొందరు బాధితులను సపోర్టు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్కకు తరచుగా అవమానాలు ఎదురౌతునే ఉన్నాయి. ఆయన యాదాద్రి వెళ్లినప్పుడు కూడా ఆయనను చిన్న పీట మీదకూర్చోబెట్టి ఆశీర్వదం ఇచ్చారు. అప్పట్లో దీనిపై దుమారం చెలరేగడంతో ఏకంగా భట్టీ దీనిపై క్లారిటీ ఇచ్చారు.

ఆ తర్వాత రంజాన్ వేడుకల్లో కూడా అసదుద్దీన్ కు డ్రైఫ్రూట్స్ తిన్పించడానికి భట్టీ సీటు నుంచి లేవడానికి ప్రయత్నించారు. కానీ పక్కన ఉన్న  సీఎం రేవంత్ రెడ్డి ఆయనను కూర్చో అన్నట్లుగా చేతితో వారించారు. కానీ పక్కనుంచి ఖమ్మం కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చి, అసదుద్దీన్ కు డ్రైఫ్రూట్స్ తినిపిస్తే మాత్రం సీఎం రేవంత్ చూస్తు ఉండిపోయారు.

Read More: CM Revanth Reddy: పదేళ్లు అడవి పందుల్లా దోచుకున్నారు.. కేసీఆర్ కు సీఎం రేవంత్ ధమ్కీ.. వైరల్ గా మారిన వీడియో..

ఇక ఇప్పుడు .. డిప్యూటీ సీఎం వాహనం అని చెప్పిన, స్టిక్కర్ ఉన్న కూడా.. ఐడీకార్డులు ఉన్నాయని చూపించిన కూడా పోలీసులు లెక్కచేయకుండా ఉండటం పట్ల, కొందరు కార్యకర్తలు అసహానం వ్యక్తం చేస్తున్నారు. ఇది డిప్యూటీ సీఎం ను అగౌరవపరిచే చర్య కదా అంటూ పోలీసులపై ఫైర్ అవుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News