జబర్దస్త్ షో నుండి ఆయన వెళ్లడం బాధించింది: కమెడియన్

జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన కమెడియన్లలో ఒకరైన అప్పారావు తనకు నాగబాబుకు ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించారు. తనదైన శైలిలో హాస్యాన్ని పండించేవారు. డైలాగ్ డెలివరీతో 

Last Updated : Jan 27, 2020, 05:54 PM IST
జబర్దస్త్ షో నుండి ఆయన వెళ్లడం బాధించింది: కమెడియన్

హైదరాబాద్: జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన కమెడియన్లలో ఒకరైన అప్పారావు తనకు నాగబాబుకు ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించారు. తనదైన శైలిలో హాస్యాన్ని పండించేవారు. డైలాగ్ డెలివరీతో అప్పారావ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'జబర్దస్త్' కామెడీ షోకి నాగబాబుగారు ఒక నిండుదనాన్ని తీసుకొచ్చారని, ఈ కామెడీ షో అంటే నాగబాబుగారికి చాలా ఇష్టమని, ఆయన చెప్పుకొచ్చారు. 

ఎట్టిపరిస్థితుల్లో నాగబాబు జబర్దస్త్ షో కు హాజరయ్యేవారని, ఈ మద్యే చాలా తీవ్రంగా గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ ఆయన మానుకోలేదని ఆయన అన్నారు. ఆయన ఈ షోను ఎంతగా ప్రేమించారనడానికి ఇదో నిదర్శనమని ఆయన అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ షో నుంచి ఎందుకు తప్పుకున్నారనేది నాకు తెలియదు కానీ, నాగబాబు ఈ షో నుంచి తప్పుకోవడానికి గల కారణం పారితోషికం మాత్రం కాదని నాగబాబుగారే చెప్పారని ఆయన అన్నారు. ఏది ఏమైనప్పటికీ నాగబాబు జబర్దస్త్ షో నుండి తప్పుకోవడం బాధ కలిగించే విషయమేనని, అతనితో ఉన్నటువంటి అనుభవాలను తెలియజేశాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News