President Election 2022: టీఆర్ఎస్‌లో టెన్షన్, ఎమ్మెల్యేలు ముర్ముకు ఓటేశారని భయం..!

President Election 2022: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ టీఆర్ఎస్‌కు షాక్‌ ఇవ్వబోతోందా..? పలువురు టీఆర్ఎస్ సభ్యులు ముర్ముకు మద్దతుగా క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారా..? టీఆర్ఎస్ ను దెబ్బకొట్టడానికి బీజేపీ తెరవెనక ప్లాన్ వర్కౌట్‌ అయ్యిందా..? రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ రోజు తెలంగాణలో జరిగిన పరిణామాలు ఏం చెబుతున్నాయి..?

Written by - Pradeep | Last Updated : Jul 18, 2022, 06:38 PM IST
  • రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణలో క్రాస్‌ ఓటింగ్..?
  • ముర్ముకు పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటేశారా..?
  • బీజేపీ ప్లాన్‌ వర్కౌట్ అయ్యిందా..?
President Election 2022: టీఆర్ఎస్‌లో టెన్షన్, ఎమ్మెల్యేలు ముర్ముకు ఓటేశారని భయం..!

President Election 2022: భారత 15 వ రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపతి ముర్ము, విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా రాష్ట్రపతి ఎన్నికల బరిలో తలపడ్డారు. ఎన్డీఏకు పలు ఇతర పార్టీలు కూడా మద్దతు పలకడంతో ద్రౌపతి ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికకావడం లాంఛనమే కానుంది. అయితే ఆమె ఎంత మెజార్టీతో గెలుస్తుందనేది ఈ నెల 21 న తేలనుంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక నుంచి మద్దతు కూడగట్టడం దాకా వరుసగా విపక్షాలకు షాకులిస్తూ వస్తున్న బీజేపీ... పోలింగ్ రోజున కూడా పలువురు క్రాస్‌ ఓటింగ్‌ చేసేలా తెరవెనక మంత్రాంగం నడిపినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో విపక్షాల నుంచి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆత్మప్రభోదానుసారం ఎన్డీయే అభ్యర్థి ద్రౌపతి ముర్ముకు ఓటేసినట్లు తెలుస్తోంది. దీంతో అనుకున్నదానికంటే భారీ మెజార్టీతో తమ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమాగా ఉన్నారు ఎన్డీయే నేతలు.

 రాష్ట్రపతి ఎన్నికల్లో తొలినుంచీ వస్తున్న సాంప్రదాయం ప్రకారం తమ సభ్యులకు ఏ పార్టీ కూడా విప్ జారీచేయదు. సభ్యులు తమకు ఇష్టం వచ్చినవారికి ఓటువేసుకోవచ్చు. విప్ ఉండదు కాబట్టి ఎవరికి ఓటేసినా అనర్హత భయం కూడా ఉండదు. దీంతో విపక్షాల నుంచి భారీగా ఓట్లను క్రాస్‌చేసి గట్టిషాక్ ఇవ్వాలని బీజేపీ ముందునుంచీ ప్లాన్ చేస్తోంది. ఇలా చేయడం ద్వారా వారి మానసికస్థైర్యాన్ని దెబ్బతీయాలనేది  ఆ పార్టీ ప్లాన్. ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రత్యేక వ్యూహంతో బీజేపీ నేతలు పనిచేశారు. అందులో భాగంగా తెలంగాణలోనూ అధికార పార్టీ నుంచి భారీగా క్రాస్ఓటింగ్ జరిగేలా మంత్రాంగం నడిపారని తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు కలిసి దీనికోసం ప్రత్యేక వ్యూహం కూడా రచించినట్లు సమాచారం.

 దీన్ని పోలింగ్ రోజు అమలుచేసినట్లు తెలుస్తోంది. ఓటింగ్ ప్రారంభంకావడానికి ముందే అసెంబ్లీకి చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు పలువురు అధికారపార్టీ ఎమ్మెల్యేలను కలిసి ఆత్మప్రభోదానుసారం ఓటేయాలని కోరారట. ముఖ్యంగా ద్రౌపతి ముర్ము గిరిజనతెగకు చెందిన వ్యక్తి కావడంతో ... గిరిజన శాసనసభ్యులను తమవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారట. ఒకవేళ ఈ ప్లాన్ వర్కౌట్ అయితే తెలంగాణలోనూ ముర్ముకు క్రాస్‌ ఓటింగ్ జరిగే అవకాశముంది. దేశవ్యాప్తంగా చాలామంది గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు ముర్ముకే ఓటేసినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలోనూ గిరిజన సభ్యులు తమ అభ్యర్థికే ఆత్మప్రభోదానుసారం ఓటేస్తారని గంపెడాశతో ఉంది బీజేపీ

 ఒకవేళ బీజేపీ వ్యూహం ఫలిస్తే ఇది అధికార టీఆర్ఎస్‌కు గట్టిషాక్‌ గానే చెప్పొచ్చు.  కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్‌కు ఇది పెద్దదెబ్బగా మారే అవకాశాలున్నాయి. తన మాట వినకుండా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌ కు పాల్పడ్డా... భవిష్యత్తులో కారు పార్టీకి పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశముంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ... ఎన్నికల ముందు వారంతా హ్యాండివ్వడం ఖాయమని విపక్షాలు అంచనావేస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్‌ లో భాగంగా వారిని తమ పార్టీల్లోకి తీసుకురావడానికి బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒకవేళ క్రాస్‌ ఓటింగ్ గనక జరిగితే టీఆర్ఎస్‌లో అసంతృప్తి నిజమేనని బయటపడిపోతుంది. అసమ్మతి రాగం పెరిగి టీఆర్ఎస్ అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చే అవకాశాలున్నాయి.

 అందుకే తమ పార్టీ నుంచి ఒక్కఓటు కూడా చేజారకుండా టీఆర్ఎస్ కూడా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలందరికీ ఈ విషయాన్ని గట్టిగానే చెప్పినట్లు టాక్. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటింగ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకున్నారట. అయితే తమ వర్గం మహిళ ఏకంగా దేశ అత్యున్నత పదవిని చేపట్టే తరుణంలో తాము ఆమెకు మద్దతుఇవ్వాలన్న ఉత్సాహంతో ఎవరైనా ముర్ముకు ఓటేశారేమేనని మాత్రం లోలోన టీఆర్ఎస్ భయపడుతోందట. ఇప్పటికే పొరపాటున తాను ఎన్డీయే అభ్యర్థికి ఓటేశానని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క బహిరంగంగానే ప్రకటించారు. ఇలా తెలంగాణ నుంచి అనుకున్నదానికంటే ఓట్లు ఎక్కువగానే ముర్ముకు పోలవనున్నాయి. ఈ నేపథ్యంలో మరింతమంది అధికార పార్టీ సభ్యులు గనక ముర్ముకు ఓటేస్తే ఇదో సంచలనంగా మారే అవకాశముంది. ఇప్పటికే తెలంగాణలో దూకుడుగా వెళ్తున్న బీజేపీకి ఇదో పెద్ద అస్త్రంగా మారే ఛాన్సుంది. సొంత పార్టీ నేతలే కేసీఆర్ పై అసంతృప్తిగా ఉన్నారని కమలం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి అవకాశం దొరుకుతుంది. మరి నిజంగా తెలంగాణలో క్రాస్‌ ఓటింగ్ జరిగిందా... లేదంటే టీఆర్ఎస్ పార్టీ వ్యూహమే ఫలించిందా.. అనేది తేలాలంటే ఈ నెల 21 వరకు ఆగాల్సిందే...!

Also Read: Low Cholesterol Foods: ఈ ఆహార పదార్థాలు మార్చిపోయి తింటున్నారా.. 10 రోజుల్లోనే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది..!

Also Read: Low Cholesterol Foods: ఈ ఆహార పదార్థాలు మార్చిపోయి తింటున్నారా.. 10 రోజుల్లోనే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News