KA Paul: టీఆర్ఎస్, బీజేపీ కుట్రను బయటపెట్టిన కేఏ పాల్.. మునుగోడు ఎన్నికల్లో ఓటమి కారణం ఇదేనట..

KA Paul On Munugode Elections: మునుగోడు ఉప ఎన్నికల్లో తన ఓటమికి కారణాలను వెల్లడించారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. అంతేకాకుండా టీఆర్ఎస్, బీజేపీ కుట్రను ఆయన బయపెట్టారు

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2022, 04:48 PM IST
KA Paul: టీఆర్ఎస్, బీజేపీ కుట్రను బయటపెట్టిన కేఏ పాల్.. మునుగోడు ఎన్నికల్లో ఓటమి కారణం ఇదేనట..

KA Paul On Munugode Elections: మునుగోడు ఉపఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోటీ ప్రచారం నిర్వహించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు కేఏ పాల్. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. తనను ఎన్నికల్లో గెలిపిస్తే మునుగోడును అమెరికా చేస్తానని హామీ ఇచ్చారు. ఏడు మండలాల్లో ఏడు వేలమందికి ఉద్యోగాలు.. ప్రతి మండలానికి ఓ కాలేజ్, హాస్పిటల్ ఇలా అనేక హామీలను గుప్పించారు. అయితే ప్రజలు ఆయనను దారుణంగా తిరస్కరించారు. కేవలం నోటాపై మాత్రమే విజయం సాధించారు. ఆయనకు  805 ఓట్లు రాగా.. 482 ఓట్లు పడ్డాయి.  

తాజాగా తన ఓటమికి గల కారణాలను బయపెట్టారు కేఏ పాల్. ఎన్నికల అధికారుల వల్లే తాను ఓడిపోయానని ఆరోపించారు. వాళ్లు టీఆర్ఎస్‌కు కొమ్ముకాశారని.. ఆ పార్టీ ఎన్నికల ఏజెంట్లు పని చేసిన తనను ఓడించారని అన్నారు. ఈవీఎంలు మార్చడం కూడా తన ఓటమికి కారణమైందన్నారు. తాను ముడుగోడు ఎన్నికల్లో ఓటమి పాలైనా.. ఈ నియోజకర్గవర్గాన్ని వీడనని అన్నారు.   

'తెలంగాణ సీఎం కేసీఆర్.. బీజేపీ బీ పార్టీగా పని చేస్తున్నారు. ఆ రెండు పార్టీలు ఒక్కటే. ఈ రెండు పార్టీలు కలిసి దేశంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డైరెక్షన్‌లోనే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు. దేశంలో బీజేపీ తప్పా.. మరో పార్టీ ఉండకూడదనే వారి లక్ష్యం. సీఎం కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారని.. సీబీఐ డైరెక్టర్‌, అమిత్‌ షాను ప్రశ్నించా. ఎవరి నుంచి సమాధానం రాలేదు..' అని కేఏ పాల్ తెలిపారు. 

డ్యాన్సులు, విచిత్ర వేషధారణతో కేఏ పాల్ ఎన్నికల్లో అందరిలోనూ నవ్వులు పూయించారు. తాను గెలుపు ఖాయమని.. సెకెండ్ ప్లేస్ ఎవరికీ అంటూ ఆయన చేసిన కామెంట్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి. తాను 50 వేల మెజార్టీతో గెలవబోతున్నానని.. విజయోత్సవ ర్యాలీ అనుమతి ఇవ్వాలని ముందుగానే పోలీసులను కూడా అనుమతి కోరారు. గెలుపోటములు పక్కన బెడితే.. కేఏ పాల్ మాత్రం డిఫరెంట్ స్టైల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు శాయశక్తులు ప్రయత్నించారు. 

Also Read: KomatiReddy Rajagopal Reddy: తమ్ముడు ఓటమికి అన్న కారణామా?.. రాజ్ గోపాల్ రెడ్డి కొంపముంచిన కాంగ్రెస్  

Also Read: Sania Mirza: షోయబ్ మాలిక్‌తో సానియా మీర్జా విడాకులు..? సోషల్ మీడియాలో వైరల్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News