Power tariff hike: ఇప్పటికే పెరిగిన నిత్యవసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. పెరిగిన ధరల కారణంగా ఇప్పటికే తలలు పెట్టుకున్న సామాన్యులకు మరో పిడుగు లాంటి వార్త. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు బ్యాడ్ న్యూస్. త్వరలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి.
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంపుపై తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీఎస్ ఈఆర్సీ) క్లారిటీ ఇచ్చింది. విద్యుత్ ఛార్జీలను 14 శాతం మేర పెంచేందుకు అనుమతినచ్చినట్లు వెల్లడించింది. నిజానికి డిస్కాంలు 19 శాతం పెంపునకు ప్రతిపాదనలు పంపంగా.. 14 శాతానికి మాత్రమే అనుమతినిచ్చినట్లు తెలిపింది.
కొత్త ఛార్జీలు ఇలా..
ఇళ్ల అవసరాలకు వినియోగించే విద్యుత్‌పై యూనిట్కో 40-50 పైసల చొప్పున ధర పెరగనుంది. ఇక వాణిజ్య అవసరాలకు వాడే విద్యుత్‌పై యూనిట్‌కు రూపాయి చొప్పున ఛార్జీలు పెరగనున్నాయి. పెంచిన ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి వర్తించనున్నాయి.
ఛార్జీల పెంపు ఎందుకు?
డిస్కౌంట్లు గత కొన్నాళ్లుగా భారీ ద్రవ్యలోటు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. గత ఏడాది డిసెంబర్లో వెల్లడైన వివరాల ప్రకారం రూ.10 వేల కోట్ల వరకు ద్రవ్యలోటు ఉన్నట్లు తెలిసింది. ఈ పరిణామాలన్నింటిని నేపథ్యంలో ఛార్జీల పెంపునకు ఓకే చెప్పింది టీఎస్ ఈఆర్సీ.
Also read: Kamareddy Crime: దారుణం... నిద్రిస్తున్న అక్కపై మరుగుతున్న నూనె పోసిన చెల్లెలు...
Also read: Bhoiguda fire mishap: బోయిగూడ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి- మృతుల కుటుంబలకు పరిహారం ప్రకటన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook