Modi calls Bandi Sanjay : బండి సంజయ్‌‌కి ప్రధాని మోదీ ఫోన్.. 15 నిమిషాల పాటు చర్చ

PM Modi calls Telangana BJP Chief Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌కి ప్రధాని మోదీ ఫోన్. తెలంగాణ విషయాలపై ఆరా తీసిన మోదీ. దాదాపు 15 నిమిషాల పాటు తెలంగాణలోని పరిస్థితులపై బండి సంజయ్‌తో మాట్లాడిన మోదీ.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 07:02 PM IST
  • బండి సంజయ్‌‌కు ప్రధాని మోదీ ఫోన్
  • తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై ఆరా
  • జాగరణ దీక్ష, బండి సంజయ్ అరెస్ట్ తదితర విషయాలపై చర్చ
  • దాదాపు 15 నిమిషాల పాటు బండి సంజయ్‌తో మాట్లాడిన మోదీ
Modi calls Bandi Sanjay : బండి సంజయ్‌‌కి ప్రధాని మోదీ ఫోన్.. 15 నిమిషాల పాటు చర్చ

PM Modi calls Telangana BJP Chief Bandi Sanjay Kumar inquires about Jagran Deeksha : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలు, జాగరణ దీక్ష, (Jagran Deeksha) బండి సంజయ్ అరెస్ట్, విడుదల వంటి విషయాలపై ఆరా తీశారు. దాదాపు 15 నిమిషాలు బండి సంజయ్‌తో మోదీ మాట్లాడారు.

మోదీ (Narendra Modi) ప్రధానంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై బండి సంజయ్‌తో (Bandi Sanjay Kumar) చర్చించారు. ఈ నెల రెండో తేదీన జాగరణ దీక్ష తర్వాత జరిగిన పరిస్థితులను ప్రధాని మోదీకి.. బండి సంజయ్ వివరించారు. మోదీని (PM Modi) త్వరలోనే తెలంగాణకు రావాలని బండి సంజయ్ ఆహ్వానించారు. 

మీ ఆశీర్వాదంతో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామంటూ మోదీకి.. బండి సంజయ్ చెప్పారు. ఇక 317జీవోపై అంశంపై కూడా ప్రధాని... బండి సంజయ్‌తో (Bandi Sanjay) చర్చించారు. అలాగే బండి సంజయ్‌పై జరిగిన దాడి (Attack on Bandi Sanjay) సంబంధించిన అంశాలపై ఆరా తీశారు. 

దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల విజయాలను ఈ సందర్భంగా మోదీ.. బండి సంజయ్‌తో చర్చించాడు. బండి పోరాటాన్ని మోదీ మెచ్చుకున్నాడు. ఎంపీ కార్యాలయంపై దాడిని మోదీ ఖండించారని తెలిసింది. కార్యాలయంలోకి వచ్చి దాడి చేయడం ఏమిటి అని మోదీ.. బండి సంజయ్‌ని అడిగారు.

Also Read : ధోనీ స్పెషల్‌ గిఫ్ట్‌.. భావోద్వేగానికి గురైన పాక్ క్రికెటర్‌! మహీ మాటిస్తే అంతేమరి!!

ఇక బండి సంజయ్ కుటుంబ సభ్యులకు (Bandi Sanjay family members) కూడా ప్రధాని మోదీ (Prime Minister Modi) ధైర్యం చెప్పారు. గాయాలపా‌లైన బీజేపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పమని మోదీ బండి సంజయ్‌తో అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలు కొనసాగాలని.. తాను అన్ని విధాలా అండగా ఉంటానని మోదీ.. బండి సంజయ్‌కు (Bandi Sanjay) హామీ ఇచ్చినట్లు తెలిసింది.

Also Read : AP Corona cases: ఏపీలో కొత్తగా 839 మందికి కొవిడ్​ పాజిటివ్​- యాక్టివ్ కేసులు @ 3,659

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News