బహుభాషా కోవిదుడిగా ఖ్యాతిగాంచిన వ్యక్తి మాజీ ప్రధాని పాములపర్తి వెంకటనరసింహారావు (పీవీ నరసింహారావు). నేడు (జూన్ 28వ తేదీ) ఆయన జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పీవీ సేవలను స్మరించుకున్నారు. ఆయనకు నివాళులు అర్పించారు. పీవీ దేశానికి అందించిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని, ఆయన చిరస్మరణీయుడని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఎదిగి దేశ ప్రధానిగా నిలిచిన ఏకైక తెలుగు ప్రధాని పీవీ రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని కొనియాడారు.
ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహరావు అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన దార్శనికుడు, బహుభాషా కోవిదుడు, దేశం గర్వించదగ్గ నాయకుడు అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. అటు పీవీ స్వగ్రామమైన వంగరలో జయంతి వేడుకల్లో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Former Prime Minister Late Sri PV Narasimha Rao Garu was a reformist of our economic policy, versatile & proud son of Telangana🙏 pic.twitter.com/CIQqodyPQt
— KTR (@KTRTRS) June 28, 2018