కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడిన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల (Nizamabad MLC bypoll) షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 9న నిజామాబాద్ ఎమ్మెల్సీ పదవికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. అక్టోబర్ 12న ఫలితాలు వెల్లడిస్తారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమమైతే ఏప్రిల్ 7నే ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి కారణాలతో ఆరునెలల పాటు ఆలస్యమైంది. SP Balu మా ఊరి వ్యక్తి.. టచ్‌లో ఉన్నాను, కానీ: వెంకయ్య నాయుడు భావోద్వేగం
భూపతి రెడ్డిపై అనర్హత వేటు పడటంతో నిజామాబాద్ (Nizamabad) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీ అయింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడటంతో అప్పటి మండలి చైర్మన్ స్వామి గౌడ్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై అనర్హత వేటు వేయడం తెలిసిందే. టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (K Kavitha) నామినేషన్ వేసి ఎన్నికల బరిలో నిలిచారు. Ambedkar Open University Admissions: ఏయూలో ప్రవేశ గడువు పొడిగింపు