/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Telangana Zones 2021: తెలంగాణలో త్వరలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలుకానుందని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి పరిగణణలోకి తీసుకోవాల్సిన కొత్త జోన్లకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 33 జిల్లాలతో కొత్త జోన్లను ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో తెలంగాణలో 10 జిల్లాలుండగా, రాష్ట్రం ఏర్పడిన తరువాత వీటి సంఖ్యను 31 చేశారు. ఆపై మరో 2 జిల్లాలను చేర్చారు. తద్వారా మొత్తం 33 జిల్లాలలో 7 జోన్లను తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో తెలంగాణలో జోన్ల విధానానికి లైన్ క్లియర్ అయింది. జోగులాంబ జోన్‌లో నారాయణపేట జిల్లాను చేర్చారు. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలిపారు. ప్రభుత్వ శాఖలకు జోన్లు, పోలీసుశాఖకు జోన్లు వేరువేరుగా ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌ మెంట్‌ సవరణ ఉత్తర్వులు-2021గా ఈ జోన్ల విధానం అమలులోకి రానుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయి నుంచి మల్టీజోన్ వరకు 95 శాతం ఉద్యోగులు స్థానికులకు కేటాయిస్తారు. ఓపెన్ కోటా కింద 5 శాతం ఉద్యోగాలు మాత్రమే కల్పిస్తారు.

Also Read: Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 01 జులై 2021, ఓ రాశివారికి వాహనయోగం

ఒకటి నుంచి 7వ తరగతి వరకు ఎక్కువ కాలం ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాలో వారిని స్థానికులుగా లెక్కలోకి వస్తుంది. గతంలోనే కేంద్రం ఆమోదం పొందినా, కొత్త జిల్లాలు ములుగు, నారాయణపేట ఏర్పాటుతో మరోసారి పూర్తిస్థాయిలో మార్పులు చేపట్టి జోన్ల విధానాన్ని కేంద్రానికి తెలంగాణ సర్కార్ పంపించింది. రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో తెలంగాణ ప్రభుత్వం 33 జిల్లాలతో 7 జోన్లను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీ జోన్ 1 కింద కాళేశ్వరం, బాసర, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి ఉండగా, మల్టీ జోన్ 2 కింద యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ జోన్లు ఉన్నాయి.

Also Read: SBI New Charges: జులై 1 నుంచి సామాన్యుడిపై ప్రభావం చూపే 5 కొత్త రూల్స్ ఇవే 

    - జోన్-1 (కాళేశ్వరం) - ఆసిఫాబాద్ - కొమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ - భూపాళపల్లి, ములుగు జిల్లాలు
    - జోన్-2 (బాసర) - ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
    - జోన్-3 (రాజన్న-సిరిసిల్ల) - కరీంనగర్, సిరిసిల్ల - రాజన్న, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి
    - జోన్-4 (భద్రాద్రి) కొత్తగూడెం - భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్

    - జోన్-5 (యాదాద్రి) - సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి - యాదాద్రి, జనగాం
    - జోన్-6 (చార్మినార్) - మేడ్చల్ - మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్
    - జోన్-7 (జోగుళాంబ) - మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ - గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
New Zones In Telangana 2021: Centre approves New zonal system in Telangana with 33 districts
News Source: 
Home Title: 

Telangana Zones 2021: తెలంగాణలో అమల్లోకి కొత్త జోన్లు, మొత్తం 33 జిల్లాలతో 7 జోన్లు

Telangana Zones 2021: తెలంగాణలో అమల్లోకి కొత్త జోన్లు, మొత్తం 33 జిల్లాలతో 7 జోన్లు, ఉత్తర్వులు జారీ
Caption: 
Telangana Zones 2021 (State Official Site)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Telangana Zones 2021: తెలంగాణలో అమల్లోకి కొత్త జోన్లు, మొత్తం 33 జిల్లాలతో 7 జోన్లు
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Thursday, July 1, 2021 - 08:55
Request Count: 
1260
Is Breaking News: 
No