Narendra Modi Phone Call: కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో పరిస్థితి దయనీయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలను అంచనా వేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడంతో భారీగా నష్టం సంభవిస్తోంది. ముఖ్యంగా ఖమ్మం, ములుగు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. బాధితులను కాపాడేందుకు కూడా అధికార యంత్రాంగం తాత్సారం చేసింది. రాష్ట్రంలో వరద పరిస్థితులపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఆరా తీశారు. రేవంత్ రెడ్డి కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌లో వివరాలు తెలుసుకున్నారు.
Also Read: Ponguleti Tears: కంటతడి పెట్టిన పొంగులేటి.. మంత్రిగా ఉండీ కాపాడలేకపోయానని భావోద్వేగం
రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులను, జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రిని ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టాన్ని సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా.. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీ సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులను సీఎం వివరించారు. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానికి తెలిపారు.
Also Read: New Route: తెలంగాణ-ఏపీకి కొత్త మార్గం.. ఖమ్మం, విజయవాడలకు వెళ్లడం ఇలా
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామన్న ప్రధాని చెప్పారు. కాగా వరదల నేపథ్యంలో ప్రధానమంత్రి స్పందించడంతో సహాయ చర్యలు ముమ్మరమయ్యే అవకాశం ఉంది. హెలికాప్టర్లు లేక ఖమ్మం జిల్లాలో సహాయ చర్యలు చేపట్టడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం స్పందించి అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని చెప్పడంతో రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగానికి ఊతం లభించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter