హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరస హత్యల కేసులో గురువారం తీర్పు వెలువడింది. ఈ కేసులో 101 మంది సాక్షులను విచారించిన నల్గొండ ఫోక్సోకోర్టు నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించింది. ముగ్గురు మైనర్ బాలికలను కిరాతకంగా అత్యాచారం, హత్యచేసి బావిలో పూడ్చిపెట్టాడు. మూడు నెలల పాటు ప్రత్యేక కోర్టు ఈ కేసును విచారించిగా, మూడు కేసుల్లో శ్రీనివాస్ రెడ్డికి మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుతో హాజీపూర్ గ్రామస్థులతో పాటు, బాధిత కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వరుస హత్య కేసుల దోషి అయిన శ్రీనివాస్ రెడ్డికి "ఉరి శిక్ష" విధిస్తూ న్యాయమూర్తి ఎస్.వి.వి.నాథ్ రెడ్డి సంచలన తీర్పునిచ్చారు.
కాగా, శ్రావణి కేసులో ఉరిశిక్ష, మనీషా కేసులో జీవిత కారాగార శిక్ష, కల్పన కేసులో శిక్షలను న్యాయమూర్తి ఖరారు చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..