Vemula Veeresham Slams Chirumarthi Lingaiah: చిరుమర్తి లింగయ్యకు పబ్లిగ్గానే వార్నింగ్ ఇచ్చిన వేముల

Vemula Veeresham vs Chirumarthi Lingaiah Ticket War: ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వలేని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అంటూ చిరుమర్తిపై మండిపడ్డారు. మా ఒపికకు ఓ హద్దు ఉంటది. మేం మాట్లాడటం ప్రారంభిస్తే.. నువ్వు మిగలవు అంటూ వేముల వీరేశం సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పబ్లిగ్గానే వార్నింగ్ ఇచ్చారు.

Last Updated : Jun 2, 2023, 09:06 AM IST
Vemula Veeresham Slams Chirumarthi Lingaiah: చిరుమర్తి లింగయ్యకు పబ్లిగ్గానే వార్నింగ్ ఇచ్చిన వేముల

Vemula Veeresham vs Chirumarthi Lingaiah Ticket War: పుట్టిన రోజు వేడుకలలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత వేముల వీరేశం సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మీద మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన పోటీ చేసేది.. గెలిచేది మనమే, నాకు కేసీఆర్, కేటిఆర్ చెప్పిందే వేదం అన్నారు. మధ్యలో వచ్చిన బుడ్డర ఖాన్లకు భయపడం అంటూ చిరుమర్తి లింగయ్యని ఉద్దేశించి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నకిరేకల్ నియోజకవర్గంలో 1400 మంది కార్యకర్తలను కొట్టిన పోలీసులు తమ అంతరాత్మ ప్రబోధం అనుసారం పని చేయండి అంటూ వేముల వీరేశం పిలుపునిచ్చారు. ఇకపై తన కార్యకర్తల మీద దెబ్బ పడితే, హైకోర్టు బోను ఎక్కిస్తాం.. దోషిగా నిలబెడతాం అని పోలీసులను హెచ్చరించారు. ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వలేని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అంటూ చిరుమర్తిపై మండిపడ్డారు. మా ఒపికకు ఓ హద్దు ఉంటది. మేం మాట్లాడటం ప్రారంభిస్తే.. నువ్వు మిగలవు అంటూ వేముల వీరేశం సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పబ్లిగ్గానే వార్నింగ్ ఇచ్చారు.
 
నకిరేకల్ నియోజకవర్గంలో పోలీసుల పని తీరు గురించి మాట్లాడుతూ.. " ఈ ప్రాంత పోలిసుల వ్యవహార శైలినీ గమనించాలి " అని నల్లగొండ ఎస్పీ అపూర్వ రావుకు విజ్ఞప్తి చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలో దోషులు తప్పించుకుంటున్నారు.. నిర్దోషులకు శిక్షలు పడుతున్నాయి. చరిత్రలో 8 నెలలుగా నకిరేకల్ టౌన్‌లో సీఐ లేరు అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్దం చేసుకోవాలన్నారు.
ఇన్నాళ్లు ఎన్నొ కస్టాల పాలైనా.. నాతో ఉన్న వారిని కాపాడుకుంటూ వచ్చిన. వారిని ఏనాడూ విస్మరించలేదు. విస్మరించబోను అని అన్నారు. 

సీఎం కేసీఆర్, మంత్రి కేటిఆర్ ఆదేశాలు తనకు ముఖ్యం. మధ్యలో వచ్చిన బుడ్డర్ ఖాన్‌ను పట్టించుకోవద్దని తన అభిమానులకు పిలుపునిచ్చారు. బరాబర్ బరిలో ఉంట.. గెలుస్తా అన్నారు. నకిరేకల్ ప్రజల కోసం చావడానికైనా సిద్దం అని వేముల వీరేశం ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు. నాకు టికెట్ రాదు అంటున్నావు.. ఇద్దరం పార్టీ టికెట్ లేకుండా బరిలోకి దిగడానికి సిద్దమా అని.. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి వేముల వీరేశం సవాల్ విసిరారు. మొత్తంగా వీరేశం చేసిన వ్యాఖ్యలు నకిరేకల్ నియోజకవర్గంతో పాటు, నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారాయి. నకిరేకల్ నియోజకవర్గంలో అన్యాయం రాజ్యమేలుతోందని.. తప్పు చేసిన వారు బయట తిరుగుతుంటే.. తప్పు చేయని వారు శిక్షలకు గురవుతున్నారని.. పోలీసులు చిరుమర్తి లింగయ్యకు అండగా నిలబడటం వల్లే ఇదంతా జరుగుతోందని వేముల వీరేశం చెప్పకనే చెప్పారు. 

ఇది కూడా చదవండి : Minister KTR: బీఆర్ఎస్‌కు ఎన్ని సీట్లు వస్తాయో జోస్యం చెప్పిన కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీకి ఆ దమ్ముందా..? 

బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే దాదాపు సీట్లు ఖరారు అని ఇప్పటికే సీఎం కేసీఆర్ సలు సందర్భాల్లో సంకేతాలు జారీచేశారు. అయినప్పటికీ.. సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్రస్థాయిలో మండిపడుతూ అనేక ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందున వేముల వీరేశం చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి కూడా ఆపాదించేవిలానే ఉన్నాయి. ఓవైపు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాలే తనకు ముఖ్యం అంటూనే మరోవైపు పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా మాట్లాడిన వేముల వీరేశం రాజకీయ భవితవ్యంపై కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకోనున్నారో అనేదే ప్రస్తుతం బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనియాంశమైంది.

ఇది కూడా చదవండి : CM KCR Record: నేటితో ముఖ్యమంత్రిగా కేసీఆర్ అరుదైన రికార్డు, తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్కడు

ఇది కూడా చదవండి : TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు.. పెండింగ్ డీఏకు గ్రీన్ సిగ్నల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News