కేటీఆర్ నిజమైన తెలంగాణ బిడ్డ అయితే తన నిజాయితీని నిరూపించుకోవాలి... రేవంత్ రెడ్డి

కేటీఆర్ ని ఎందుకు మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయడంలేదని, కేటీఆర్ రెండు నెలలు పదవి నుంచి తప్పుకోలేరా? తన నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. కేటీఆర్ నిజంగా తెలంగాణ బిడ్డ అయితే మీడియా ముందు తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. 

Last Updated : Jun 8, 2020, 07:58 PM IST
కేటీఆర్ నిజమైన తెలంగాణ బిడ్డ అయితే తన నిజాయితీని నిరూపించుకోవాలి... రేవంత్ రెడ్డి

హైదరాబాద్: జన్వాడలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖామాత్యులు కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించారని, కాగా ఈ ఫామ్ హౌస్ కి కేటీఆర్ యజమాని కాదని ఫామ్ హౌస్ కేటీఆర్ లీజుకు మాత్రమే తీసుకున్నారన్నారని తెరాస విప్  బాల్కసుమన్ గతంలో అన్న వ్యాఖ్యలపై రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  అరటి పండు ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి

గాంధీభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సర్వే నెo 301-313 వరకు నాకు ఎలాంటి భూములు లేవని, తాను ఇంతకుముందే ఈ విషయాలు వెల్లడించానని కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొనడంపై కాంగ్రెస్ ఎంపీ  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదే అంశంపై మార్చ్ 5న డ్రోన్ ఉపయోగించానని నన్ను జైల్ కి పంపారని, తన వల్ల సీఎం కేసీఆర్, కేటీఆర్ ఆస్తులు, ప్రాణాలకు ప్రమాదం ఉందని పోలీసులు నివేదికలు ఇచ్చారని అన్నారు. అదే నివేదికలో కేటీఆర్ భూములు ఉన్నాయని కేటీఆర్ కుటుంబం నివసిస్తుందని కోర్టుకు సమర్పించిన నివేదికలో ఉందని ఆయన గుర్తు చేశారు.  సులువుగా రోగ నిరోధకశక్తిని పెంచే చిట్కాలు

అయితే 2019 మార్చ్ 7వ తేదీన 301 సర్వే నెంబర్ లో రెండు ఎకరాలు కేటీఆర్ ఆయన భార్య పేరుమీద భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని, 2018 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ లో 2కోట్ల ఆస్తులు జన్వాడ అర్బనా వెంచర్స్ పేరుమీద ఆస్తులు ఉన్నట్లు స్వయంగా కేటీఆర్ తెలిపారన్నారు. 25 ఎకరాలున్నఈ ప్రాంతంలో 1లక్ష స్కెర్ ఫీట్లలో ఫామ్ హౌస్ నిర్మాణం కేటీఆర్ నిర్మించారన్నారు. 

 గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్ 

ఇదిలాఉండగా 1990లో తన శాఖలో అవినీతి ఆరోపణలు రావడంతో విచారణకు అదేశించగా భాద్యత వహిస్తూ అప్పటి మంత్రి కోరెను రంగారావు మున్సిపల్ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారని, విచారణలో అక్రమాలకు తనకు ఎలాంటి సంబంధాలు లేవని తేలాక మళ్ళీ మంత్రి పదవి అధిరోహించారని, నేను చేస్తున్న ఆరోపణల్లో ఒక్క శాతం తప్పు ఉన్నా ఏ శిక్షకు అయినా నేను సిద్ధమని అన్నారు. 

కేటీఆర్ ని ఎందుకు మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయడంలేదని, కేటీఆర్ రెండు నెలలు పదవి నుంచి తప్పుకోలేరా? తన నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. కేటీఆర్ నిజంగా తెలంగాణ బిడ్డ అయితే మీడియా ముందు తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News